కరోనా వైరస్ ను అదుపు చేయాలంటే మన ముందున్న ఏకైక మార్గం వ్యాక్సిన్ వేయడమే. అందుకే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ చాలా వేగంగా సాగుతుంది. వ్యాక్సిన్ల కొరత కారణంగా ప్రభుత్వం పలు విదేశీ వ్యాక్సిన్లకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఓ చిన్న గ్రామం ఇండియాలో నూరు శాతం వ్యాక్సినేట్ అయిన ఊరుగా రికార్డు సృష్టించింది. బందీపురా జిల్లాకు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేయన్ గ్రామం ఖాతాలోకి ఈ ఘనత వెళ్లింది. ఆ ఊరిలో ఉన్న వయోజనులు అంతా వ్యాక్సిన్ కరోనా వైరస్ తీసుకున్నారు.
362 మంది వయోజనులు ఉన్న ఆ గ్రామానికి హెల్త్ కేర్ వర్కర్లు వెళ్లి వ్యాక్సినేట్ చేశారు. కానీ ఆ ఊరికి వెళ్లాలంటే సరైన రోడ్డు మార్గం లేదు. కనీసం 18 కిలోమీటర్ల దూరంలో కాలినడకన వెళ్ల వలసి వస్తుంది. గ్రామంలో ఉన్న వారంతా ప్రాచీన తెగలకు చెందినవారని, వాళ్లు తమ వద్ద ఉన్న గోవులను తీసుకుని ఎత్తైన కొండలకు వెళ్తుంటారని, వారికి వ్యాక్సిన్ ఇవ్వడం ఓ పెద్ద టాస్క్ అని ఆరోగ్యశాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. ఆ గ్రామానికి ఇంటర్నెట్ లేదని, వాళ్లకు అపాయింట్మెంట్లు లేవని మెడికల్ ఆఫీసర్ బాషిర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం రూపొందించిన మోడల్ ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నది. ఆ రాష్ట్రంలో 45 ఏళ్ల వయసు దాటిన వారిలో 70 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.