ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే వారు కొందరుంటారు. ఇప్పుడు చెప్పే ఉదంతాన్ని చూస్తే.. ఇది నిజమనిపించక మానదు. కరోనా కాలం.. దానికి లాక్ డౌన్ తోడైన వేళ.. ఒక ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్ తనను తాను మార్చేసుకున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొన్నటికి మొన్న ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క విలవిలలాడిపోతున్న వేళ.. హైదరాబాద్ లోని కొన్ని ఫైవ్ స్టార్ హోటళ్లు హోం ఐసోలేషన్ ఏర్పాట్లు చేయటమే కాదు.. అత్యవసరమైతే ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పించటం.. వైద్య సేవల్ని అందించిన వైనం తెలిసిందే.
ఇప్పుడు వ్యాక్సినేషన్ టైం నడుస్తోంది. దీన్ని కూడా తమకు తగ్గట్లుగా మార్చింది హైదరాబాద్ కు చెందిన హోటల్. హైటెక్ సిటీలోని ఈ ఫైవ్ స్టార్ హోటల్ లో కొవిడ్ టీకాకు సంబంధించిన ప్యాకేజీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ పోస్టు ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారుతోంది.
టీకా కోసం డిమాండ్ పెరగటం.. దాని కోసం భారీ క్యూలు.. భౌతిక దూరం అన్నది లేకుండా టీకా కోసం గంటల కొద్దీ వెయిట్ చేయటం లాంటివేమీ లేకుండా.. సింఫుల్ గా తమ ఫైవ్ స్టార్ హోటల్ కు వస్తే.. అక్కడ బ్రేక్ పాస్ట్..లంచ్ తో పాటు వైద్య నిపుణుల సమక్షంలో టీకా వేయటమే కాదు.. కాస్త సేద తీరేందుకు వీలుగా సదుపాయాన్ని ఇస్తున్నట్లు సదరు హోటల్ తన ప్రచార ప్రకటనలో పేర్కొన్నారు.
అంతేకాదు.. ఉచిత వైఫై సౌకర్యాన్ని అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇందుకోసం తాము ప్రముఖ ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వెల్లడించారు. ఈ పోస్టు ప్రకారం.. హోటల్లో ఒక్కో వ్యాక్సిన్ కోసం రూ.2999లతో పాటు అదనంగా పన్నులు వసూలు చేస్తారు.అయితే.. వ్యాక్సిన్ ను ఫైవ్ స్టార్ వసతులతో పొందొచ్చన్నట్లుగా ప్రచారం చేస్తున్న తీరు పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది.