కరోనా వ్యాక్సిన్ పై ప్రధాని నరేంద్రమోడీ కీలక ప్రకటన

Update: 2020-11-24 18:25 GMT
ప్రపంచమంతా సెకండ్ వేవ్ కరోనాతో అల్లకల్లోలం అవుతున్న వేళ వ్యాక్సిన్ పరిశోధనలు చివరి దశకు వచ్చాయి. మూడో దశ ట్రయల్స్ పూర్తి చేసిన పలు కంపెనీల వ్యాక్సిన్లు వినియోగానికి రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ పై ప్రధాని నరేంద్రమోడీ కీలక ప్రకటన చేశారు.

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక భేటికి సిద్దమయ్యారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఎవరికి వ్యాక్సిన్ పంపిణీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాక్సిన్ ముందుగా కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. కరోనా మొదటి టీకాను ముందుగా ఒక కోటి మంది ఆరోగ్య కార్యకర్తలకు, డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఇచ్చేందుకు ఎంపిక చేయనున్నట్టు కేంద్రం ప్రణాళికలు చేస్తోంది.

జూలై 2021 నాటికి దాదాపు 20కోట్ల నుంచి 25 కోట్ల మంది ప్రజలకు 400 మిలియన్ డోస్ ల నుంచి 500 మిలియన్ల డోస్ ల వరకు వ్యాక్సిన్ అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Tags:    

Similar News