సాధారణంగా ఒక ప్రభుత్వానికి.. ఒక సంస్థకు మధ్య ఒప్పందం జరుగుతున్నా.. దేనికైనా ఆర్డర్ పెడితే.. ఆ వెంటనే పనులు పూర్తి అవుతాయి. కోరినట్లే పని పూర్తి అయిన తర్వాత చెల్లింపులు జరుపుతాయి. కరోనా వేళ.. టీకాల విషయంలో వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు విస్మయానికి గురి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డర్ పెట్టిన వ్యాక్సిన్ కు సంబంధించి.. ముందస్తుగా అడ్వాన్సు చెల్లించిన తర్వాతే ఆర్డర్ ను కన్ఫర్మ్ చేస్తున్నారట.
అంతేకాదు.. అడ్వాన్సు చెల్లించిన తర్వాత నిర్ణీత గడువును కోరి.. వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నారట. అంతేకాదు.. టీకాలు పంపటానికి ముందే.. దానికి సంబంధించిన బ్యాలెన్సును సెటిల్ చేసిన తర్వాతే వ్యాక్సిన్లు పంపుతున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వాల నుంచి డబ్బులు ఎక్కడకి పోవు. కానీ.. కరోనా వేళలో.. తీవ్రమైన పోటీ.. డిమాండ్ ఉన్న టీకాల కోసం ఇప్పటివరకు అనుసరిస్తున్న వ్యాపార విధానాలకు భిన్నంగా టీకా కంపెనీలు వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఎంత డిమాండ్ ఉంటే మాత్రం.. రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో మరీ ఇంతలా వ్యవహరించటమా? అని సీనియర్ అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు.