వైరస్ తగ్గాలంటే ఆ స్థాయిలో టీకాలు ఇవ్వాల్సిందే..!

Update: 2022-02-13 03:30 GMT
గడిచిన రెండున్నర ఏళ్ల కాలంగా కరోనామహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని దేశాలలోనూ అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే వైరస్ తన ప్రభావాన్ని వేరియంట్ల ద్వారా చూపించింది. వివిధ దేశాల్లో వైరస్ ధాటికి లక్షల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇంకా చెప్పాలి అంటే జనాభా ఎక్కువగా ఉండే దేశాల్లో అయితే కోట్లలో నమోదు అయ్యాయి. మరికొన్ని దేశాలలో అయితే భారీ సంఖ్యలో మరణాలు కూడా వెలుగు చూశాయి. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఉండే చాలా దేశాల్లో కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.

కానీ కొన్ని దేశాలలో కొవిడ్  కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కొంత మేరకు తగ్గుముఖం పట్టింది. అయితే ఇది వైరస్ తగ్గిందనడానికి  సూచిక కాదని నిపుణులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని  డబ్ల్యుహెచ్ఓ కూడా చాలా సార్లు స్పష్టం చేసింది. వైరస్ తగ్గిపోయేందుకు మరి కొంత సమయం పడుతుందని పేర్కొంది.

ఇదిలా ఉంటే డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ కూడా నిపుణులు చెప్తున్న మాటలతోనే ఏకీభవించారు. కొవిడ్ ప్రభావం ఇంకా కొన్ని రోజుల వరకు ఇలానే కొనసాగుతోందని ఆయన అన్నారు. అయితే దీనికి చెక్ పెట్టడానికి వ్యాక్సినేషన్ అనేది ఓ మార్గమని గుర్తు చేశారు. ఇప్పటికే చాలా దేశాలు వ్యాక్సినేషన్ తీసుకోవడంలో  మెరుగైన ఫలితాలను సాధించాయని అన్నారు. అందుకే వ్యాధి వ్యాప్తి కొంత మేర కంట్రోల్ లో ఉన్నట్లు చెప్పారు.

అంతేగాకుండా కొవిడ్ పూర్తిస్థాయిలో అంతం కావాలి అంటే వ్యాక్సినేషన్ ప్రజలకు అందించాలని పేర్కొన్నారు. ఇలా చేస్తే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.  దీనితో పాటు వైరస్ పూర్తిస్థాయిలో తగ్గాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే జనాభాలో సుమారు 70 శాతం మంది ఒకటి లేదా రెండు రోజులు ఖచ్చితంగా తీసుకోవాలని ఆయన చెప్పారు.

ఇప్పటికే చాలా మంది వైరస్ కు వ్యాక్సిన్ ను తీసుకున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో సుమారు 70 శాతం మంది వైరస్ కు వ్యతిరేకంగా టీకాలు తీసుకున్నట్లు అయితే కొవిడ్ నుంచి తీవ్రమైన ముప్పు తొలిగే అవకాశం ఉన్నట్లు టెడ్రోస్ తెలిపారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా టీకాలను అందజేయడానిక తలో చేయి వేయాలని కోరారు. ఇలా చేస్తే ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో అనుకున్న టార్గెట్ పూర్తి అవుతుందని అన్నారు. వైరస్ తీవ్రమైన దశ వ్యాక్సిన్ తీసుకుంటేనే ముగుస్తుందని అన్నారు. టీకా తీసుకునే విషయం మన చేతిల్లోనే ఉందని పేర్కొన్నారు.

సంపన్నదేశాల్లో టీకా పంపిణీ కార్యక్రమం జోరుగు సాగుతుంటే ఆఫ్రికా కండంలో మాత్రం ఇప్పటి వరకు  పది శాతానికి పైగా మాత్రమే నమోదు అయినట్లు టెడ్రోస్ చెప్పారు. ఇది మొత్తం ప్రపంచంలోనే అతి తక్కువ టీకా పంపిణీ రేటు అని ఆయన గుర్తు చేశారు. ఆఫ్రికా దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంత చేయాల్సి అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. ఇందుకుగానూ మోడెర్నా సీక్వెన్స్‌ను తీసుకుని ఆఫ్రికాలో తొలి టీకాను తయారు చేసినట్లు వివరించారు. దీనిని ఆఫ్రికన్ బయోలాజిక్స్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ టీకా అందుబాటులోకి వస్తే ధర కూడా చాలా తగ్గుతుందని ఆయన స్పష్టం చేశారు.   


Tags:    

Similar News