కొన్ని వియాలు అసలు నమ్మలేకుండా ఉంటాయి. కానీ వాటిని ప్రత్యక్షంగా చూసినవారు తెలియజేస్తే...నిజమే కదా అనిపిస్తుంది. నరేంద్రమోడీ ప్రధానమంత్రి పీఠం ఎక్కే వరకు బీజేపీ అగ్రనేతలుగా చెలామణిలో ఉన్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి - ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీల మధ్య కుట్రల రాజకీయ జరిగిందంటే నమ్ముతారా? ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. వాజ్ పేయిని గద్దె దించేందుకు అద్వానీ కుట్ర చేశారని సీనియర్ జర్నలిస్ట్ ఎన్ పీ ఉల్లేఖ్ రాసిన "ది అన్ టోల్డ్ వాజ్ పేయి; పొలిటియన్ అండ్ పారడాక్స్" పుస్తకంలో వెల్లడించారు.
ఉల్లేఖ్ రాసిన పుస్తకం ప్రకారం ఎన్డీఏ నాయకుడిగా వాజ్ పేయి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే ఆయన్ను గద్దె దింపి అద్వానీని ప్రధానిగా చేయాలని కుట్ర జరిగిందట. ఈ విషయం విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్న ప్రధానమంత్రి వాజ్ పేయి ఆ సమయంలో తన దగ్గరకు వచ్చిన ఓ మంత్రితో ఈ కుట్రను పంచుకున్నారట. అయితే సదరు మంత్రి ఎల్ కే అద్వానీ కేంద్రంగా ఇలాంటి కుట్ర జరుగుతుందని తమకు సైతం అవగాహన ఉందని చెప్పడంతో వాజ్‌పేయి ఒకింత షాక్‌కు గురయ్యారట. అయితే ఈ కుట్ర తాలుకూ తదనంతర పరిణామాలు తెలుసుకునేందుకు వాజ్ పేయి ప్రయత్నించారట.
ఈ విషయాలకు మద్దతుగా ఉన్న పలు అంశాలను కూడా ఈ పుస్తకంలో ఉల్లేఖ్ రాసుకొచ్చారు. బీజేపీకి మార్గదర్శకత్వం వహించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో వాజ్ పేయిని రాష్ట్రపతిని చేసి అద్వానీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలనే ప్రయత్నం జరగటాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో అద్వానీ కేంద్రంగా వాజ్‌పేయిని దింపే కుట్ర జరిగి ఉంటుందని విశ్లేషించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/