భారతదేశ మాజీ ప్రధాని వాజ్ పేయి గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన జీవితంలోని కొన్ని విషయాలు మాత్రం మరుగున పడిపోయాయి. అయితే ప్రముఖ జర్నలిస్టు సాగర్ ఘోష్ వాజ్ పేయి జీవిత చరిత్ర ఆధారంగా ఓ బుక్ ను ప్రచురించారు. ఇందులో వాజ్ పేయి లైఫ్లోని ఆసక్తికర విషయాలను రచించారు.
ముఖ్యంగా వాజ్ పేయి బ్రహ్మచర్యం గురించి సాగర్ ఘోష్ చెప్పిన విషయాలు చర్చనీయాంశంగా మారాయి.. వాజ్ పేయి చనిపోయేంత వరకు బ్రహ్మచారిగానే మిగిలారు. ఆయన ఎవరినీ పెళ్లి చేసుకోలేదు.కానీ ఆయన ఓ అమ్మాయిని లవ్ చేశాడని... ఆ అమ్మాయికి కూడా వాజ్ పేయి అంటే చాలా ఇష్టమని ఈ పుస్తకంలో పొందుపర్చారు.
అయితే ఒకరంటే ఒకరికి ప్రాణం అనేలా ప్రేమించుకున్న వీరు పెళ్లి చేసుకోకపోవడానికి పెద్ద కారణమే ఉంది. అంతేకాదు..'నేను బ్యాచ్ లర్ నే.. కానీ బ్రహ్మచారిని కాదు..' అని వాజ్ పేయి అంటుండేవారు.. అలా ఎందుకు అన్నారో ఇప్పుడు చూద్దాం..
వాజ్ పేయి కాలేజీలో చదువుకున్న రోజుల్లో 'కౌల్' అనే అమ్మాయిని అమితంగా ఇష్టపడేవారు. మొదట కౌల్ సోదరుడు చంద్ హక్షర్ తో వాజ్ పేయికి పరిచయం ఏర్పడింది. అతని ద్వారా కౌల్ పరిచయం అయింది. ఆ తరువాత వీరిద్దరు ప్రేమించుకున్నారు.
అయితే వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు వాజ్ పేయిని కౌల్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో కౌల్ ను బ్రజ్ నారాయణ్ కు ఇచ్చి పెళ్లి చేశారు. ఈయన ఢిల్లీలోని రామ్ జస్ కాలేజీలో ఫలాసఫీ ప్రొపెసర్ గా పనిచేస్తున్నాడు.
వాజ్ పేయి జీవిత చరిత్రపై చాలా పుస్తకాలు వచ్చాయి. అయితే వీటిలో కింగ్నుక్ నాగ్ రచించిన 'అటల్ బిహారీ వాజ్ పేయి: ద మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్' లో వాజ్ పేయితో తనుకున్న అనుబంధాన్ని కౌల్ వివరించినట్లు ఇందులో పేర్కొన్నారు. తన ప్రేమ విషయాన్ని చెబుతూ లైబ్రరీలోని ఓ పుస్తకంలో ప్రేమలేఖను ఉంచి కౌల్ కు ఇచ్చారు.
అయితే ఆ తరువాత కౌల్ ప్రత్యుత్తరం రాశారు. కానీ అది వాజ్ పేయికి చేరలేదు. దీంతో ఎటువంటి సమాధానం రాకపోయేసరికి వాజ్ పేయి వైపు సైలెన్స్ అయ్యారు. అయితే ఎంపీగా గెలిచిన తరువాత వాజ్ పేయి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సమయంలో కౌల్ ను కలవడం ప్రారంభించారు. అయితే 1980లో కౌల్ సావి అనే మాగ్జిన్ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సమయంలో వాజ్ పేయికి, తనకు మంచి అనుబంధం ఉందని.. అయితే అబంధం గురించి కొద్ది మందికి మాత్రమే అర్థమవుతుందని తెలిపారు. వాజ్ పేయితో ఉన్న అనుబంధాన్ని నా భర్తకు వివరించాల్సిన అవసరం రాలేదని తెలిపారు.
వాజ్ పేయిని ఈ విషయంపై తెలుసుకునేందుకు ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ ఇంటర్వ్యూ కోసం ఎంతో ప్రయత్నించారు. కానీ కుదరలేదని తాను రాసుకున్న ఆత్మకథ 'డెవిల్స్ అడ్వోకేట్'లో చెప్పారు. అయితే కౌల్ ను సంప్రదించగా వాజ్ పేయితో మాట్లాడుతానని తెలిపారు.
ఆ తరువాత వాజ్ పేయి ఇంటర్వ్యూకు అంగీకరించినట్లు కరణ్ థాపర్ తన పుస్తకంలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా 1960లో కౌల్ తన భర్తకు విడాకులు ఇచ్చి వాజ్ పేయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వాజ్ పేయి పెళ్లి చేసుకుంటే ఆ ప్రభావం రాజకీయ జీవితం, పార్టీపై ప్రభావం పడుతుందని ఆర్ ఎస్ఎస్ భావించేందని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు.
అయితే కౌల్ ను పెళ్లి చేసుకోకపోయినా ఆయన జీవితంలో కౌల్ కు ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. దీంతో ఆయన నేను 'బ్యాచ్ లర్ నే.. కానీ బ్రహ్మచారిని కాదు..' అని వాజ్ పేయి అనేవారు.