చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం వ్యాపారంలోనే కాదు.. రాజకీయాల్లోనూ మామూలే. ప్రజాదరణ కలిగిన నాయకుల పేర్లు చెప్పుకొని చాలా పార్టీలు బతికేస్తుంటాయి. తాము ఎవరి పేరు అయితే వాడుకుంటున్నామో.. ఆయన విలువలు.. సిద్దాంతాల్ని తాము పాటించకున్నా.. సదరు నేత పేరును మాత్రం ఒక రేంజ్లో వాడేస్తుంటాయి.
ఒక్క ఓటు తేడాతో ప్రధానమంత్రి కుర్చీపోతుందని తెలిసినా.. వెనక్కి తగ్గకుండా.. విలువలు దిగజారకుండా పీఎం పదవిని పోగొట్టుకున్న పెద్దమనిషి వాజ్ పేయి. అలాంటి వ్యక్తి పేరు చెప్పుకునే బీజేపీ.. ఈ రోజు ఏ తరహా రాజకీయాల్ని అనుసరిస్తుందో దేశ ప్రజలకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
పవర్ కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే ప్రధాని మోడీ.. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు షాల గురించి తెలియంది ఏమీ లేదు. నాలుగున్నరేళ్ల కాలంలో ఆయన మార్క్ పాలన ఎలా ఉంటుందో దేశ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది.
ఇదిలా ఉంటే.. అటల్ జీ మరణం నేపథ్యంలో ఆయనకున్న ఇమేజ్ ను పార్టీకి బదిలీ చేసే కార్యక్రమాన్ని మోడీషాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా అటల్ జీ చితాభస్మాన్ని మొదట అనుకున్న దానికి బదులుగా వందకు పైగా నదుల్లో.. దేశంలోనిఅన్ని రాష్ట్రాల్లోనూ కవర్ అయ్యేలా ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని ఇప్పటికే షురూ చేశారు.
కలశ యాత్ర పేరుతో అన్నిరాష్ట్రాలకు పంపి.. వివిధ పుణ్యనదుల్లో వాజ్ పేయి చితాభస్మాన్ని కలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమం మీద ఊహించని రీతిలో వాజ్ పేయి కుటుంబం నుంచి ఒకరు బయటకు వచ్చి బీజేపీ తీరును తప్పు పట్టారు.
మాజీ ప్రధాని వాజ్ పేయి మరణాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని ఆయన మేనకోడలు కరుణ శుక్లా మండిపడ్డారు. అటల్ జీపై ప్రజలకున్న సానుభూతిని 2019 ఎన్నికల్లో వాడుకోవాలని భావిస్తుందని.. అటల్ బతికి ఉన్నప్పుడే కాదు మరణించిన తర్వాత కూడా వాడుకోవటం ఆపటం లేదన్నారు. వాజ్ పేయి చితాభస్మ కలశాలతో బీజేపీ నాయకులు పర్యటనలు చేపట్టటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. చౌకబారు రాజకీయాలంటూ తిడుతున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఊహించని వ్యాఖ్యల షాక్ కు బీజేపీ గురైంది.