టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి అరెస్టు!

Update: 2018-01-22 09:22 GMT
మాజీ టీడీపీ నేత‌ - ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై బ్యాంకుల నుంచి మోస‌పూరితంగా భారీగా రుణాలు పొందార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. రుణం పొంద‌డం కోసం న‌కిలీ డాక్యుమెంట్లు స‌మ‌ర్పించ‌డంతో ఫైనాన్స్ కార్పొరేష‌న్...సీబీఐని ఆశ్ర‌యించింది. ఆ ఆరోపణలు నిజమ‌ని నిర్ధారించుకున్న సీబీఐ అధికారులు.....ఆదివారం ఉదయం వాకాటిని అరెస్ట్‌ చేశారు. టీడీపీ మాజీ నేత‌ - ఎమ్మెల్సీ వాకాటి అరెస్టు వార్త నెల్లూరు జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. అయితే, ఈ వార్త‌పై ఇప్ప‌టివ‌ర‌కు టీడీపీ త‌ర‌పు నుంచి ఎటువంటి స్పంద‌న వెలువ‌డ‌లేదు.

సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన వాకాటి వీఎన్‌ ఆర్‌ ఇన్‌ ఫ్రా - వీఎన్‌ ఆర్‌ రైల్ - లాజిస్టిక్స్‌  కంపెనీలను నిర్వహిస్తున్నారు. షామీర్‌ పేటలో రూ.12 కోట్లు విలువచేసే భవనం విల‌వ‌ను నకిలీ డాక్యుమెంట్లతో ఎక్కువ‌గా చూపించి బ్యాంకు రుణం పొందారు. వాకాటి కోరిన రూ.250 కోట్ల రుణానికి గానూ రూ.190 కోట్ల‌ను 2014లో ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా మంజూరు చేసింది. వాకాటి....బకాయి రూ.205.02 కోట్లకు చేర‌డంతో వాకాటి ఆస్తుల‌ను జ‌ప్తు చేసేందుకు వెళ్లిన ఫైనాన్స్‌ కార్పొరేషన్ అధికారుల‌కు షాక్ త‌గిలింది. ఆ రుణం కోసం వాకాటి న‌కిలీ డాక్యుమెంట్ల‌ను స‌మ‌ర్పించి మోసం చేశార‌ని సీబీఐకు ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఫిర్యాదు చేసింది. దీంతో, కేసు నమోదు చేసి విచార‌ణ జ‌రిపిన విచార‌ణలో వాకాటిపై ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేల‌డంతో సీబీఐ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. దీంతోపాటు హైదరాబాద్‌ లోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా - బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా - ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకుల‌ నుంచి వాకాటి పొందిన‌ రూ.443 కోట్లు చెల్లించ‌క‌పోవ‌డంతో ఆయ‌న ఆస్తుల అటాచ్‌ మెంట్ - జప్తు ప్రక్రియను చేప‌ట్టారు.

వాస్త‌వానికి.....ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌కు ముందు వాకాటి టీడీపీలో చేరారు. గ‌త ఏడాది సీబీఐ నోటీసులు జారీ చేసిన త‌ర్వాత‌ నారాయ‌ణ రెడ్డిని టీడీపీ నుంచి స‌స్పెండ్ చేశారు. ప్ర‌స్తుతం వాకాటి అరెస్టు పై టీడీపీ అధిష్టానం స్పందించాల్సి ఉంది. టీడీపీ అధిష్టానం ఆదేశాల ప్ర‌కారం  అరెస్టు అయిన వాకాటిపై మండ‌లి చైర్మ‌న్ చ‌క్ర‌పాణి ఏ విధ‌మైన చ‌ర్య‌లు తీసుకుంటారో అన్న‌ది ఆస‌క్తిగా మారింది. మ‌రోవైపు, త‌న‌ను  ఎమ్మెల్సీ చేసినందుకు ఎల్ల‌పుడూ టీడీపీకి - చంద్ర‌బాబు నాయుడుగారికి రుణ‌ప‌డి ఉంటాన‌న్నారు. ఈ వ్య‌వ‌హారంలో పార్టీ నిర్ణ‌యానికి క‌ట్ట‌బడి ఉంటాన‌ని చెప్పారు. ఈ వ్య‌వ‌హారం నుంచి త్వ‌ర‌లోనే క్లీన్ చిట్ తో బ‌య‌ట‌ప‌డ‌తాన‌ని తెలిపారు.
Tags:    

Similar News