ప్రేమ పండుగ.. ఖరీదు ఎంతో తెలుసా?

Update: 2020-02-14 02:30 GMT
ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ఎప్పుడో ఒక్కప్పుడు ఎవరినో ఒకరిని చూసి లవ్ లో పడుతారు. అది మానవ సహజం.. పడలేదు అంటారా? మీలో ఏదో డిఫెక్ట్ ఉన్నట్టే.. కొంచెం డాక్టర్ కు చూపించుకుంటే మంచిది. శంకర్ తీసిన రోబో సినిమాలో రోబోట్ అయిన ‘చిట్టి’యే ప్రేమలో పడగా లేనిది అన్ని ఫీలింగ్స్ ఉన్న మనిషులు ఇప్పటివరకూ పడలేదంటే ఏదో తేడా ఉన్నట్టే లెక్క కదా.. అసలు ప్రపంచాన్ని నడిపించేదే ప్రేమ అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అందుకే ప్రేమపై అన్ని వర్ణనలు.. అన్ని అప్యాయతలు కనిపిస్తాయి.

అసలు ప్రేమంటే.. ఏంటీ? అని కవి హృదయులను అడిగితే...  ‘రెండు హృదయాల కలయిక..’ అంటారు..  ప్రేమ లేనిదే ఈ సృష్టియే లేదు.. రెండు మనసులు కలిస్తేనే ఈ సృష్టి మనుగడ సాధ్యమైంది. అంతటి అద్వితీయమైన ప్రేమకు ఒకరొజుంది..  అదే ‘ప్రేమికుల దినోత్సవం’ వాలెంటైన్స్ డే. ప్రేమికులంతా ఉద్వేగంగా ఎదురుచూసే రోజు.. కొందరు ఇదే రోజున ప్రేమ వ్యక్తపరిచే రోజుగా ఎదురుచూస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆత్రంగా ఎదురుచూసే  రోజును క్యాష్ చేసుకునే వారు లేకపోలేదు..

ప్రేమికుల రోజు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ బిజినెస్ కు ప్లాన్ చేశాయి వివిధ సంస్థలు. వాలెంటైన్స్ డే మేనియాను తీసుకొచ్చాయి.  గత సంవత్సరం ప్రేమికుల రోజున ఏకంగా దేశవ్యాప్తంగా 30వేల కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందట.. అమెరికాలో అయితే ఈ ఒక్క రోజే ఏకంగా 20.7 బిలియన్ డాలర్లను ఖర్చు చేశారట.. ఇష్టమైన వారికి కానుకలు ఇస్తూ వారిని ఇంప్రెస్ చేసేందుకు, వారి కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించడం.. బహుమతులు ఇచ్చేందుకు భారీగా ఖర్చు చేశారట..

మరి ఈ పండుగ మళ్లీ వచ్చింది. ఈసారి కూడా  డబ్బు భారీగా ఖర్చు చేసేందుకు ప్రేమికులు సిద్ధమవుతున్నారు. ఎక్కువగా క్యాండీలు కొనేస్తున్నారట.. ఏకంగా పాశ్చాత్య దేశాల్లో 2.4 బిలియన్ డాలర్లను ఒక్క క్యాండీలకే ఖర్చు చేస్తున్నారట..  దాని తర్వాత చ్లాక్లెట్లు, గ్రీటింగ్ కార్డ్స్, హాలిడే స్పాట్స్, పువ్వులు,నగలు కొంటున్నారు. బట్టలు, బొమ్మలు డైమండ్ జువెల్లరీ, వాచ్ , స్మార్ట్ ఫోన్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఈ వాలంటైన్స్ డేకు గులాబీలకు బాగా ధరొచ్చింది. ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రేమికులు వాడే ఆయుధం ‘గులాబీనే’ ఆ పూలు ఇప్పుడు ఆకాశాన్ని అంటాయి. ఏకంగా ఒక్కో మేలు రకం గులాబీ ధర ఏకంగా రూ.150-200 వరకు ఉంది.  వివిధ దేశాల నుంచి గులాబీలను దిగుమతి చేసుకుంటున్నారు. దేశం లో గులాబీ పూలను ఎక్కువగా ఎగుమతి చేసే రాష్ట్రాలు తెలంగాణ, మహారాష్ట్రలు.. గత ఏడాది ఏకంగా 30 కోట్ల రూపాయల గులాబీలను ఇతర దేశాలకు ఎగుమతి చేశారట..

ఇక వాలంటైన్స్ డే కోసం ఆత్రంగా ఎదురుచూసే వారిలో మగాళ్లే ఎక్కువ మంది. ఆడవారు తక్కువే ఖర్చు చేస్తున్నారు. ప్రేమికులు ఈ రోజున తమ ప్రేమను నచ్చిన వ్యక్తి కి తెలియజేయడానికి ఒక ముహూర్తంగా ఎంచుకుంటారు. దీన్ని క్యాష్ చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల బిజినెస్ సాగుతుందంటే అతిశయోక్తి కాదు..
Tags:    

Similar News