ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండోరోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వడంతో తమ కొంప మునుగుతుందని భావించిన చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. వంశీకి ఎలా మాట్లాడే అవకాశం ఇస్తారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలకు మద్దతు ధరపై చర్చించాలని వంశీని మాట్లాడకుండా అడ్డుకున్నారు. తమ బండారం ఎక్కడ బయటపెడుతానని భయపడి చివరకు స్పీకర్ వినకపోవడంతో బాబు, టీడీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు..
ఇక సభలో చంద్రబాబు, టీడీపీ నేతలు పలాయనం చిత్తగించిన తర్వాత వంశీ మాట్లాడారు. తాను టీడీపీ సభ్యుడిగా కొనసాగలేనని.. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్ ను అభ్యర్థించాడు. దీంతో స్పీకర్ వంశీ ప్రతిపాదనను పరిశీలిస్తానని.. కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చని సూచించారు.
ఇక తాను నియోజకవర్గ సమస్యల మీదనే సీఎం జగన్ ను కలిశానని వంశీ సభలో చెప్పుకొచ్చారు. ఏపీలో ఇంగ్లీష్ మీడియం, సహా ఆరోగ్య శ్రీని ప్రవేశపెట్టి సీఎం జగన్ పేదల పక్షపాతిగా వ్యవహరించారన్నారు.
ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు - టీడీపీ ఎమ్మెల్యేలు తనను మాట్లాడనీయకుండా చేయడంపై వంశీ ఫైర్ అయ్యారు. చంద్రబాబు గారు మాకు హక్కులేదా మేం ప్రశ్నించకూడదా అని ప్రశ్నించారు. పప్పూ బ్యాచ్ కులం పేరుతో, తల్లిదండ్రులను కించపరుస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని వంశీ మండిపడ్డారు. పప్పూ బ్యాచ్ కి జయంతికి - వర్ధంతికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. తనకు భయపడే చంద్రబాబు బయటకు వెళ్లిపోయాడని కౌంటర్ ఇచ్చారు.
Full View