టీడీపీ యువనేత - కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనని వంశీ మోహన్ నిజంగానే ఆగేట్టు కనిపించడం లేదు. గత నెల 11న ఎన్నికల్లో కీలక ఘట్టమైనప పోలింగ్ ముగిసిందో - లేదో... తన ప్రత్యర్థి - వైసీపీ గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై వరుసగా తనదైన శైలిలో విరుచుకుపడుతున్న వంశీ... తాజాగా మరోమారు పాత వ్యాఖ్యలనే వల్లె వేసి... ఆరిందనుకున్న వేడిని మరోమారు రాజేశారు. 23న ఫలితాలు వెలువడిన తర్వాత యార్లగడ్డకు సన్మానం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసిన వంశీ సంచలన రేపిన సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యలతోనే ఆగకుండా యార్లగడ్డ ఇంటికి తన మనుషులను పంపి మరింత రచ్చ చేశారు. దీనిపై యార్లగడ్డ పోలీసులను ఆశ్రయించగా కాస్తంత తగ్గినట్టుగానే కనిపించిన వంశీ... ఫేస్ బుక్ వేదికగా వివరణ ఇచ్చే యత్నం చేశారు. వివరణ పేరిట ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ లోనూ యార్లగడ్డపై విరుచుకుపడిన వంశీ... తనదైన వివాదాస్పద వైఖరిని చాటుకున్నారన్న వార్తలు వినిపించాయి. అయితే పరిస్థితి అంతకంతకూ హీటెక్కుతున్న నేపథ్యంలో యార్లగడ్డ కూడా వంశీకి గట్టిగానే కౌంటర్ వేశారు. ఈ క్రమంలో కొన్నాళ్ల పాటు సైలెంట్ గానే ఉంటున్న వంశీ... గురువారం మరోమారు సన్మానం మాటను పలికారు.
23న ఫలితాలు వచ్చాక యార్లగడ్డకు సన్మానం చేసి తీరతానని వంశీ చేసిన ఈ కామెంట్ మరోమారు హీట్ ను పెంచేసింది. ఫలితాలకు సమయం దగ్గరపడిన నేపథ్యంలో ఫలితాలు వచ్చేదాకా కూడా ఆగలేకపోతున్నారంటూ వంశీపై సెటైర్లు వినిపిస్తున్నాయి. అయినా ఎన్నికలన్నాక గెలుపో - ఓటమో సర్వసాధారణం. గెలిచిన అభ్యర్థిని ఓడిన అభ్యర్థి చేసేదేమీ లేదు. అలాగని ఓడిన అభ్యర్థిని గెలిచిన అభ్యర్థి కూడా పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం లేదనే చెప్పాలి. మరి ఇవన్నీ తెలిసినా కూడా యార్లగడ్డకు సన్మానం చేసి తీరతానంటూ వంశీ పదే పదే చెబుతున్న తీరు చూస్తుంటే... దారిన పోతున్న దానయ్యను పిలిచి మరీ గొడవ పెట్టుకున్నట్టే ఉందన్న వాదన వినిపిస్తోంది.