వైసీపీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ఎంత మంచిదన్న విషయాన్ని టీడీపీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యే చెప్పిన మాటలు నిజంగానే ఆసక్తికరమేనని చెప్పక తప్పదు. ఎందుకంటే... ఈ పథకం ఎంత గొప్పదో వారిద్దరూ మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో తమదైన రీతిలో వర్ణించారు. అమ్మ ఒడి పథకం ఓ సంక్షేమ పథకం కాదని పేర్కొన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఆ పథకం నిజంగానే ఓ సంస్కరణేనని కూడా తేల్చి చెప్పేశారు. అయినా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరంటే... టీడీపీ టికెట్ మీదనే ఎమ్మెల్యేలుగా గెలిచినా... జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీకి దూరమైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ - గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు.
మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో జగన్ సర్కారు ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రస్తావించిన వల్లభనేని వంశీ మోహన్... అమ్మఒడి ఒక గొప్ప సంస్కరణ పథకమని పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘అమ్మఒడి’ పథకాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. పేదల భవిష్యత్ మార్చేందుకు అమ్మ ఒడి పథకం ఉపయోగపడుతుందన్నారు. పేద ప్రజలు, రైతులు కూలీలు మాత్రమే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తారని, అలాంటి వారికి అమ్మఒడి భరోసా ఇచ్చిందన్నారు. ఈ పథకం వల్ల డ్రాపౌట్స్ తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి గొప్ప పథకాన్ని తెచ్చి ఇతర రాష్ట్రాలకు సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఇటువంటి మంచి పథకంపై జరుగుతున్న చర్చలో టీడీపీ అధినేత చంద్రబాబు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. పేద పిల్లల భవిష్యత్‌ను మార్చే పథకానికి టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో చదవుకున్న వ్యక్తిగా తాను అమ్మ ఒడి పథకానికి మద్దతు ఇస్తున్నానని, ఇలాంటి గొప్ప పథకాన్ని తెచ్చిన సీఎం జగన్‌ను అభినందిస్తున్నానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్‌ను అభినందించాలన్నారు. ఇటువంటి పథకాలను మరిన్ని తీసుకురావాలని సీఎం జగన్‌ను కోరారు.
ఆ తర్వాత మద్దాలి గిరిధరరావు మాట్లాడుతూ అమ్మ ఒడి పథకం పేద పిల్లల్లో ఏ తరహాలో భరోసా నింపుతుందన్న విషయాన్ని ఉదాహరణలతో వివరించారు. అమ్మఒడి పథకం పవిత్రమైందని చెప్పిన మద్దాలి గిరి... ఈ పథకం పట్ల బడుగు, బలహీన వర్గాలు అనందం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ఇటువంటి గొప్ప పథకాన్ని వ్యతిరేకించాలని టీడీపీ నిర్ణయించడం బాధాకరం అన్నారు. అమ్మ ఒడి లాంటి పథకాన్ని ప్రవేశపెట్టినందకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా పేద కుటుంబాలు తమ పిల్లలను బడకి పంపించేందుకు ఉత్సాహం చూపడమే కాకుండా ఇతరత్రా కారణాలు చూపి బడి మాన్పించే అవకాశమే లేదని చెప్పారు. అంతేకాకుండా వైసీపీ సర్కారు ప్రభుత్వ బడుల్లో ప్రవేశపెట్టబోతున్న ఆంగ్ల మాధ్యమం పేద పిల్లలకు ఎలాంటి అవకాశాలను కల్పిస్తుందన్న విషయాన్ని కూడా మద్దాలి వివరించారు. ఆంగ్ల మాధ్యమంలో చేరిన తనకు ఆ మాధ్యమం విలువ ఎంతో తెలుసునని, ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా పేద విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు దక్కడం ఖాయమని కూడా మద్దాలి చెప్పుకొచ్చారు.