తెలుగుదేశం పార్టీ వాళ్లు ఆయనను సస్పెండ్ చేశారు. అలాగని వైసీపీ వాళ్లు ఆయనకు కండువా వేయడం లేదు. అధికార పార్టీ కండువా పడాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే అని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షరతు పెట్టేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి వల్లభనేని వంశీ అంత రెడీగా ఉన్నట్టుగా లేరు.
అది కూడా ఉప ఎన్నికలు వచ్చినా తనకు తోచిన వారికే టికెట్ ఇచ్చేది ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో వంశీ రాజీనామాకు రెడీ కాలేకపోతున్నారు. ఉన్నంతలో లక్ ఏమిటంటే... ఆయనను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. తద్వారా ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఏర్పడింది. అలాగని అధికార పార్టీ వాళ్లు ఆయనకు కండువా వేయలేదు.
ఇద్దరు మంత్రులను వెంట పెట్టుకుని సీఎంను కలిశారు వంశీ. అయితే ఆ ఇద్దరూ కూడా వంశీకి పెద్దగా ఫేవర్ చేయలేకపోయారు. జగన్ నిర్ణయమే ఫైనల్ అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో వంశీది ఒకింత అటూ ఇటూ కాని పరిస్థితి అవుతోందని పరిశీలకులు అంటున్నారు.
అందుకు ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది పై ఫొటో. వంశీకి సన్నిహితులు అయిన ఇద్దరు మంత్రులు తాపీగా - దర్జాగా కూర్చుకుంటే.. వంశీ వల్ల పక్కనే కూర్చున్నా.. అంచున కూర్చున్నారు. యాదృచ్ఛికంగానే ఈ స్టిల్ బయటకు వచ్చిందేమో కానీ... వంశీ ఇప్పుడున్న పరిస్థితికి నిదర్శనంగా ఈ ఫొటో ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.