కడుపులో దాచుకున్న ఆగ్రహం.. అక్రోశం కట్టలు తెగినప్పుడు ఎలా ఉంటుందన్న విషయాన్ని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన తాజా మాటల్లో చూపించారని చెప్పాలి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీకి గుడ్ బై చెప్పిన ఆయన.. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ తో కలిసి అడుగులు వేస్తానని చెప్పటం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు.. ఒక మీడియా చానల్ లో డిబేట్ సందర్భంగా ఫైర్ అయిన వైనంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయ్యప్ప మాల వేసుకొని ఎలా తిడతారని పలువురు ప్రశ్నించారు. అన్నింటికి మించి టీడీపీ ఎమ్మెల్సీ.. పార్టీ సీనియర్ నేత రాజేంద్రప్రసాద్ ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా చెప్పటమే కాదు.. ఆయనకు తాను క్షమాపణలు చెబుతున్నట్లుగా వంశీ వెల్లడించారు.
సారీ చెబుతూనే.. తెలుగు తమ్ముళ్ల తప్పుల్ని ఎత్తి చూపిస్తూ.. తనను విమర్శించిన వారిని మాటలతో ఉతికి ఆరేసినంత పని చేశారు. చంద్రబాబు తనకు కోట్ల రూపాయిలు ఇచ్చారని రాజేంద్రప్రసాద్ చెబుతున్నారని.. కానీ ఆ డబ్బులన్ని తనకు వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవటం కోసం ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఏ పార్టీ అయినా ఎన్నికల కోసం డబ్బులు ఇవ్వటం సహజమని.. ఆ మొత్తాన్ని ఎన్నికల్లో ఖర్చు చేయటం మామూలు విషయమేనన్నారు. అంత మాత్రానికే తనను తిట్టటంలో అర్థమేమిటని ప్రశ్నించారు.
రాజేంద్రప్రసాద్ తనను తొలుత తిట్టారని.. ఆ కోపంతోనే తాను అలా మాట్లాడానే తప్పించి మరింకేమీ కారణం లేదన్నారు. అయినా నేనేమైనా వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చానా? దుర్గగుడిలో క్షుద్రపూజలు చేశానా? అని మండిపడ్డారు. అయ్యప్ప మాల వేసుకొని అగౌరవంగా మాట్లాడానని తప్పు పడుతున్నారు. అసలు అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తి మీద అనవసరంగా మాట్లాడింది ఎవరు? ఎవరు మొదలు పెట్టారు? అని ప్రశ్నించారు.
తన కంటే రాజేంద్రప్రసాద్ వయసులో పెద్దోడని.. తాను అయ్యప్ప మాల వేసుకొని ఉన్నాను కాబట్టే.. సారీ చెప్పానన్నారు. తాను బాబు కాళ్లు పట్టుకున్నట్లు రాజేంద్రప్రసాద్ చెబుతున్నారని.. పెద్దోళ్లకు దండం పెట్టటం సంస్కారమని.. బాబు తన తండ్రిలాంటి వారని ఆయన కాళ్లకు దండం పెడితే తప్పేమిటని నిలదీశారు. పెద్ద వాళ్లకు దండం పెట్టటం సంస్కారమన్న విషయాన్ని రాజేంద్రప్రసాద్ మర్చిపోయారన్నారు.
సిగ్గు ఉంటే వంశీ రాజీనామా చేయాలని లోకేశ్ అంటున్నారని.. ఆయన అన్నట్లే రాజీనామా చేస్తానని.. కాకుంటే ఓడిన లోకేశ్ కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్నారు. బాపట్ల అసెంబ్లీకి పోటీ చేసిన ఓడిన అన్నం సతీశ్.. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని.. అదే రీతిలో లోకేశ్ చేస్తే.. తాను కూడా తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. లోకేశ్ కు ఒక న్యాయం.. మరొకరికి ఇంకో న్యాయం ఉండదంటూ ఫైర్ అయ్యారు. కడిగిపారేసినట్లుగా ఉన్న వంశీ వ్యాఖ్యలకు చినబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.