తెలుగుదేశం పార్టీకి రాజీనామా అంటూ హడావుడి చేస్తున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పరారీలో ఉన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన ఎవరికీ అందుబాటులో లేరని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.
వంశీని సంప్రదించడానికి తాము ప్రయత్నించినట్టుగా.. అయితే ఆయన అందుబాటులోకి రానట్టుగా తెలుగుదేశం పార్టీ వర్గాలు ప్రకటిస్తూ ఉండటం గమనార్హం! వంశీ మొబైల్ కు ఫోన్ చేసిన స్విచ్ఛాఫ్ వస్తోందని తెలుగుదేశం లీడర్లు చెబుతూ ఉన్నారు. ఆయన అలా ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారని.. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్టే లెక్క అని టీడీపీ వర్గాలు చెబుతూ ఉండటం గమనార్హం.
వంశీతో మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు పలువురు టీడీపీ లీడర్లను పురమాయించారట ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. వంశీని నిలుపుకోవడానికి చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నాలు చేశారు. అయితే వారికి వంశీ అందుబాటులోకి రానట్టుగా వార్తలు వస్తున్నాయి. కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ లీడర్లు వంశీతో చర్చలు జరిపే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా సమాచారం.
అయితే వారిని కలవడానికి వంశీ ఇష్టపడలేదని తెలుస్తోంది. ఆఖరికి ఫోన్ లో కూడా అందుబాటులోకి రాలేదట. దీంతో ఆయన పరారీలో ఉన్నట్టే అని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
వంశీతో మాట్లాడటానికి తాము ప్రయత్నించినట్టుగా అయితే ఆయన అందుబాటులోకి రాలేదని కేశినేని నాని కూడా ప్రకటించారు. మరి ఈ పరిణామాలను గమనిస్తే.. తెలుగుదేశం పార్టీకి దూరంగా వల్లభనేని వంశీ మోహన్ పరార్ అయినట్టే అని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి!