వంశీ మళ్ళీ ఈ ట్విస్ట్ ఏమిటి ..?

Update: 2019-10-29 08:07 GMT
వల్లభనేని వంశీ వారం రోజులుగా ఏపీ రాజకీయం మొత్తం ఈయన చుట్టూనే తిరుగుతుంది. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ .. టీడీపీకీ - తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబుతో - సీఎం జగన్ తో - బీజేపీ ఎంపీ సుజనా తో చర్చలు జరిపిన తరువాత బెదిరింపుల వల్లే  నేను రాజీనామా చేస్తున్న అంటూ రాజీనామా లేఖని పార్టీ అధినేతకీ పంపించారు.

కానీ , తెలుగుదేశం పార్టీలో డైనమిక్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న వల్లభనేని వంశీని వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదు అని - రాజీనామా విషయంలో మరోసారి ఆలోచించుకోవాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వంశీకి మరో అవకాశం ఇచ్చారు. అలాగే వంశీని బుజ్జగించే పనిని ఎంపీ కేశినేని నానికి - మరో మాజీ ఎంపీకి  అప్పగించారు. వారిద్దరూ కూడా వంశీతో భేటీ అయ్యి .. పార్టీ లోనే ఉండాలంటూ కోరారు. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా పార్టీ మీ వెంటే ఉంటుంది అని తెలిపారు.

ఇక వంశీ పార్టీకి  ఎమ్మెల్యే పదవికి కూడా  రాజీనామా చేయడంతో వైసీపీలోకి వెళ్లడం లాంఛనమే అని అంతా అనుకున్నారు. కానీ, దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా వంశీ రాజీనామా వ్యవహారం పై తాజాగా బీజేపీ రాష్ట్ర సమన్వయకర్త రఘురాం స్పందించారు. వైసీపీ బెదిరింపులకు బెదరాల్సిన పనిలేదని - తమతో చేతులు కలిపితే అండగా ఉంటామని తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తూ - రాజకీయంగా మచ్చలేని నాయకులు పార్టీలోకి  ఎవరొస్తామన్నా.. వారిని సాదరంగా ఆహ్వానిస్తాం అని - ఎమ్మెల్యే వంశీ వైసీపీ బెదిరింపుల వల్లే పదవికి రాజీనామా చేయబోతున్నారు అనేది నిజమైతే వారి బెదిరింపులకు ఆయన భయపడాల్సిన అవసరం లేదు. బీజేపీలోకి వస్తే ఆయనకు అన్నివిధాలా అండగా ఉంటాం అని తెలిపారు. మాజీ మంత్రి గంటా కూడా వైసీపీతోపాటు బీజేపీతోనూ చర్చలు జరుపుతున్నారు అని ,  వీరిద్దరూ కూడా  బీజేపీలో చేరడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని రఘురాం తెలిపారు. దీనితో వంశీ అసలు ఏ పార్టీలో చేరతారో అర్థం కాక గన్నవరం ప్రజలు అయోమయంలో ఉన్నారు.
Tags:    

Similar News