జీతం తీసుకోకుండా ప‌ని చేస్తానంటున్న ఏపీ అధికారి!

Update: 2019-06-02 06:29 GMT
ఇప్ప‌టివ‌ర‌కూ ఏ రాష్ట్రంలో చోటు చేసుకోని ఉదంతంగా దీన్ని చెప్పాలి. ముఖ్య‌మంత్రి అనుస‌రిస్తున్న విధానాల‌కు ముగ్దుడైన తాను.. తానిక జీతం తీసుకోకుండా ప‌ని చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఇంత‌కీ ఈ మాట‌ను చెప్పిన అధికారి రాష్ట్రం ఏమిటో తెలుసా?  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.

ఇంత‌కీ ఎవ‌రా సీనియ‌ర్ ప్ర‌భుత్వ ఉద్యోగి? ఆయ‌నేం చేస్తుంటారు? ఎందుకా నిర్ణ‌యాన్ని తీసుకున్నారు?  అన్న వివ‌రాల్లోకి వెళితే.. శ్రీ‌కాకుళం జిల్లాలోని వంశ‌ధార ప్రాజెక్టు ఎస్ ఈగా ప‌ని చేస్తున్నారు ఎం. సురేంద్ర రెడ్డి. 1986 జ‌న‌వ‌రిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్  ఇంజినీరుగా త‌న కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయ‌న‌.. తాజాగా ఎస్ ఈ స్థాయికి ఎదిగారు. ప్ర‌స్తుతం ఆయ‌న నెల‌స‌రి జీతం అక్ష‌రాల రూ.1,65ల‌క్ష‌లు.

ఏపీకి కొత్తగా ముఖ్య‌మంత్రి అయిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనుస‌రిస్తున్న ప‌థ‌కాల‌కు ముగ్ధుడైన స‌ద‌రు సీనియ‌ర్ అధికారి.. త‌న ప‌ద‌వీకాలం ఉన్న రెండేళ్ల‌లో అస్స‌లు జీతం తీసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించారు. ఒక‌వేళ‌.. రూల్స్ ఒప్పుకోకపోతే ఒక్క రూపాయి ఇస్తే స‌రిపోతుంద‌న్నారు. తాను ఆర్థికంగా స్థితిమంతుడిన‌ని.. త‌న‌కు జీతం అక్క‌ర్లేద‌న్నారు.

తాను మొద‌ట్నించి సేవా కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హిస్తుంటాన‌ని.. మొద‌ట్నించి త‌న జీతానికి వ‌చ్చే మొత్తంలో కొంద‌రిని చ‌దివిస్తుంటాన‌ని.. ఇప్ప‌టికే తాను చ‌దించిన వారిలో ప‌లువురు అమెరికాలోనూ.. దేశంలోని వేర్వేరు చోట్ల సెటిలై.. ఉద్యోగాలు చేస్తున్న‌ట్లుగా వెల్ల‌డించారు. జ‌గ‌న్ పాల‌నా తీరుకు ముగ్ధుడినైన తాను ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. ఆయ‌న ప్ర‌తిపాద‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News