టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఇటీవల తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమైన సందర్భంగా తను చేయించిన సర్వే వివరాలను వెల్లడిస్తూ టీఆర్ఎస్ 100కు పైగా సీట్లు గెలుచుకుంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నేతలు దీనిపై సంతోషం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం కేసీఆర్ ప్రకటన వెనుక లెక్కలు వేరేనని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమిపాలు కాక తప్పదనే విషయం తెలిసిపోవడంతోనే వందకు పైగా సీట్లు సాధిస్తామని కేసీఆర్ ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కు ప్రజాదరణ ఉంది నిజమైతే... కాంగ్రెస్ - టీడీపీ పార్టీల నుంచి టీఆర్‌ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలు నిర్వహించాలని వంశీ చంద్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేకత కారణంగా ఓడిపోతామనే ఆందోళన వల్లే టీఆర్‌ఎస్ ఉప ఎన్నికలకు పోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
కేసీఆర్ తనపై తాను నమ్మకం కోల్పోయారనీ, అందుకే సర్వేల పేరుతో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారని వంశీచంద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులూ, ఎంపీల పని తీరుపై సర్వేలు చేయడం కాదని, కేసీఆర్ పాలనపై వరంగల్ లో నిర్వహించనున్న టీఆర్‌ఎస్ బహిరంగ సభలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు, సొంత పార్టీ నేతలతో సీఎం మైండ్‌గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై ప్రొగ్రెస్ కార్డు ఇవ్వాలని అన్నారు. మూడున్నరేళ్ల కాలంలో ఏం సాధించారని టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తారని వంశీచంద్ రెడ్డి ప్రశ్నించారు. హామీలు నెరవేర్చకపోవడం, అవినీతి వంటి అంశాల్లో టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వందకు పైగా సీట్లు సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటికి నీరివ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని చెబుతున్నట్టుగా గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై సీఎం ఎందుకు మాట్లాడం లేదని వంశీచంద్ రెడ్డి విమర్శించారు. అధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని నిభంనలను ఉల్లంఘిస్తున్నారని వంశీ మండిపడ్డారు. జిల్లాల్లో అధికార పార్టీ నాయకులు చెప్పితేనే సీసీ రోడ్లు మంజూరు అవుతున్నాయన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం కోసం కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/