ఎట్టకేలకు గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారు. పెన్నుపోటుతో చర్యల కత్తి ఝుళిపించారు. అనూహ్యమైన ఆరోపణలతో.. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తమ పార్టీ ఎమ్మెల్యే పుత్రరత్నం.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన వనమా రాఘవేంద్ర పై చర్యలు తీసుకున్నారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయటమే కాదు.. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్లుగా ప్రకటన వెల్లడైంది.
పాల్వంచలో సామాన్యుడైన రామక్రిష్ణ కుటుంబం మొత్తం (నలుగురు, రామక్రిష్ణ, అతని భార్య, ఇద్దరు ఆడపిల్లలు) ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. అయితే.. ఇందులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ ప్రమేయం ఉందని.. ఆయన పెట్టిన ఇబ్బందుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సెల్ఫీ వీడియోతీసుకోవటం.. అది కాస్తా బయటకు రావటం తెలిసిందే.
తనకున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు తన ఆస్తి తనకు రావాలంటే.. తన భార్యను ఒంటరిగా హైదరాబాద్ కు తీసుకురావాలని.. తన వద్దకుపంపాలని వనమా రాఘవ అడిగారని.. అతడికున్న పలుకుబడి.. అధికారం ముందు తాను పోరాటం చేయలేనని.. అందుకే తామంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఈ వీడియో పెను సంచలనంగా మారటంతో పాటు.. పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అతన్ని వెంటనే అరెస్టు చేయాలన్న ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి.
కామ్రేడ్ నారాయణ లాంటి వాళ్లు అయితే.. మరో అడుగు ముందుకు వేసి.. అతడ్ని సంసారానికి పనికి రాకుండా చేయాలంటూ డిమాండ్ చేయటం వివాదాస్పదమైంది. ఇదిలాఉంటే.. ఈ ఉదంతం బయటకువచ్చిన తర్వాత నుంచి కూడా ఆయన్ను అరెస్టు చేసే విషయంలో పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మహత్య జరిగి ఐదు రోజులు అవుతున్నా.. అతడిపైచర్యలు తీసుకోని తెలంగాణ అధికారపక్షం.. అందుకు భిన్నంగా సెల్ఫీ వీడియో బయటకు రావటం.. అందులోని అంశాలు పార్టీని ఇరుకున పడేలా చేశాయి.
ఈ సెల్ఫీ వీడియోలని విషయాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపాయి. రాఘవపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. అతడెన్ని ఆరాచకాలు చేస్తారన్న విషయాన్ని తెలియజేసేలా.. వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రచురించటం.. ఈ ఇష్యూ మరింత తీవ్రంగా మారింది. దీంతో ఈ వ్యవహారాన్ని టీఆర్ఎస్ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. వెంటనే చర్యలకు ఉపక్రమించకుంటే పార్టీకి భారీడ్యామేజ్ తప్పదన్న విషయాన్ని గ్రహించిన కేసీఆర్.. వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీఆర్ఎస్ అధినేత తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి కమ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్ చార్జ్ నూకల నరేష్ రెడ్డి ప్రకటించారు. ఇదంతా బాగానే ఉంది.. మరి పోలీసులు ఆయన్నుఎప్పుడు అరెస్టు చేస్తారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.