ఆమె ఫైర్ బ్రాండ్. ఒక సాధారణ ఉపాధ్యాయురాలిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్న నేత. అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె వంగలపూడి అనిత. ఆమె 2014లో ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత ఆమె అసెంబ్లీలో తనదైన వాణిని వినిపించి నాటి విపక్షం వైసీపీని సభ లోపలా బయటా కట్టడి చేశారు.
ఇక 2019 ఎన్నికల్లో ఓడినప్పటికీ నోరు విప్పిన అతి కొద్ది మంది టీడీపీ నేతలలో ఆమె ఒకరు. దాంతో చంద్రబాబు ఆమెకు టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ షిప్ ఇచ్చారు. అదే ఊపులో ఏపీ టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా చేశారు. ఇక అనిత వైసీపీ మీద ఒక్క లెక్కన దూకుడు చేస్తున్నారు. ఆమె ఏకంగా జగన్ని టార్గెట్ చేస్తూ చేసే కామెంట్స్ వేసే పంచులు ఎపుడూ వైరల్ అవుతాయి.
లేటెస్ట్ గా జగన్ విశాఖ టూర్ లో ఉండగానే ఆయన పులివెందుల పులి కాదు తాడేపల్లి పిల్లి అంటూ చేసిన కామెంట్స్ సర్కార్ వారికి హీటెక్కించాయి. ఈ మధ్యనే జరిగిన విజయవాడ ఆసుపతిలో యువతి సామూహిక అత్యాచార ఘటన మీద మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతోనే వాగ్యాదం చేయడమే కాకుండా జగన్ ఏలుబడిలో ఊరికొక ఉన్మాది అంటూ టీడీపీ ప్రింట్ చేసిన పుస్తకాలను ఆమె చేతిలో పెట్టి మరీ షాక్ ఇచ్చేశారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం కాదు, మహిళల భద్రతలో ఫెయిల్ అయిన ఏపీ సీఎం జగన్ కి నోటీసులు ఇవ్వండి అని మహిళా కమిషన్ ని టార్గెట్ చేసిన అనిత ఫైర్ బ్రాండ్ కి వైసీపీ నుంచి సరైన కౌంటర్లు అయితే ఇప్పటిదాకా పడడం లేదు.
ఆ మాటకు వస్తే అధికార పార్టీగా వైసీపీ ఉంది. లక్షలాది మంది క్యాడర్ ఉన్న పార్టీ అని చెప్పుకుంటోంది. మరి అలాంటి పార్టీకి వైసీపీ మహిళా అధ్యక్షురాలు రాష్ట్ర స్థాయిలో ఎవరైనా ఉన్నారా. ఉంటే వారు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్నలే ఇపుడు ముందుకు వస్తున్నాయి. ఏపీలో దాదాపుగా ప్రతీ రోజూ ఏదో ఘటన మహిళలకు సంబంధించి జరుగుతూనే ఉంది. దాని మీద టీడీపీ నాయకురాలు అనిత అయితే ఆ వైపు నుంచి దూసుకువస్తున్నారు.
మరి అధికార పార్టీ నుంచి కౌంటర్ ఇవ్వడానికి నేతలు ఎవరూ అంటే నో అనే జవాబు వస్తోంది. అప్పట్లో ఎపుడో ఆర్కే రోజా మహిళా ప్రెసిడెంట్ గా ఉండేవారు. ఆమె టీడీపీ మీద బిగ్ సౌండ్ చేసేవారు. ఆమె తరువాత ఎవరిని ఆ పోస్టులో నియమించారో కూడా తెలియడంలేదు. మరి మహిళా సమస్యల మీద అధికార పార్టీ నుంచి కూడా తాము తీసుకుంటున్న చర్యలు చెప్పడానికైనా విపక్షాన్ని కట్టడి చేయడానికైన మహిళా ప్రెసిడెంట్ అవసరమే కదా. అనిత రూపంలో ఎదురవుతున్న ఈ నిలువెత్తు ప్రశ్నకు వైసీపీ వద్ద జవాబు ఉందా. చూడాలి.