వంగవీటి రాధాకు మైనస్... కొడాలి నానికి ప్లస్...?

Update: 2022-07-01 11:30 GMT
ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో చూసుకుంటే  వంగవీటి రంగా వారసుడిగా రాధాకు జనంలో బాగానే  పేరుంది. అయితే పక్కా మాస్ లీడర్ గా ఎదిగి అనతికాలంలోనే రాష్ట్ర స్థాయిలో బలమైన నేతగా మారిన వంగవీటి రంగా  పొలిటికల్ డైనమిజంలో మాత్రం రాధా వారసుడు కాలేకపోతున్నారు అని అంటున్నారు. రాధాలో ఆ తరహా దూకుడు కరవు అయితే అదే క్రిష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని వంటి వారు తమ స్పీడ్ తో ముందుకు పోతున్నారు.

ఈ సందర్భంగా రంగా వారసుడి గురించి మాట్లాడుకున్నపుడు ఆయనలోని మైనస్ పాయింట్స్ ఏంటి అన్న చర్చ కూడా సాగుతోంది. రాధాలో ఫస్ట్ లోపం ఏంటి అంటే నిలకడలేని తత్వం. ఆయన తండ్రి ఏపీలో అత్యధిక ఓట్ షేర్ కలిగిన కాపులకు ఆరాధ్య దైవం. మరి ఆ తండ్రి బిడ్డగా రాధా ఈపాటికే స్టేట్ ఫిగర్ కావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. రాధా రెండు దశాబ్దాల ప్రత్యక్ష రాజకీయ జీవితంలో గెలిచించి ఒకే ఒక మారు. అది 2004లో మాత్రం. ఆ తరువాత నుంచి ఆయన చట్ట సభలకు దూరంగానే ఉండిపోయారు.

దీనికి కారణం. వరసబెట్టి పార్టీలు రాధాక్రిష్ణ మారడమే అంటారు. ఇక రాధాలో ఆలోచన కంటే ఆవేశం పాలు ఎక్కువగా ఉండడం వల్ల డెసిషన్స్ అన్నీ రాంగ్ గా తీసుకుంటున్నారు అని అంటారు. అవి చాలా సార్లు తొందరపాటు చర్యలుగానే మారిపోయాయి. ఆయన ప్రస్తుతం టీడీపీలో ఉంటూ అక్కడ ఇన్ యాక్టివ్ గా ఉన్నారు. నిజానికి టీడీపీకి ఈ రోజు బలం పెరుగుతోంది. అదే టైమ్  లో ఆయన ఉన్న క్రిష్ణా జిల్లాలో పార్టీ బాగా పుంజుకుంది. ఈ సమయంలో రాధా ఫోకస్ కావాల్సిన చోట సైలెంట్ గా ఉండిపోవడం నిజంగా రాంగ్ డెసిషన్ అంటున్నారు.

అదే టైమ్ లో ఆయన జనసేన వైపు చూస్తున్నారు అన్న ప్రచారం కూడా సాగుతోంది. ఒక విధంగా రాధా డెసిషన్ ఈ టైమ్ లో కరెక్టా అంటే ఆలోచించుకోవాల్సిందే అని కూడా సూచనలు వస్తున్నాయట. ఈ సందిగ్దత ఇలా ఉండగానే ఆయన రాజకీయాల మీద వ్యక్తిగత స్నేహాలు కూడా చాలా ప్రభావం చూపిస్తునాయి. ఆయన జగన్ తో విభేదించి ఆ పార్టీని 2019 ఎన్నికల ముందు వీడారు. అయితే ఆయనకు ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ, కొడాలి నాని స్నేహితులుగా ఉన్నారు.

ఈ ఇద్దరితో ఆయన తరచూ సమావేశం అవుతూ ఉంటారు. ఆ విధంగా సమావేశం అయినపుడల్లా ఆయన వైసీపీలోకి వెళ్తారు అన్న ప్రచారం సాగుతోంది. దీని వల్ల కూడా రాధా రాజకీయ పోకడల మీద అనుచరులకే అనుమానాలు రేగే పరిస్థితి ఏర్పడుతోంది అంటున్నారు. ఇక ఆయనకు తండ్రి నుంచి రాజకీయ వారసత్వంతో పాటు ఆస్తిగా బలమైన కాపుల మద్దతు కూడా ఈపాటికే దక్కి ఉండాలి. కానీ రాధా తన నిలకడ లేని విధానాల వల్ల కాపులలో మద్దతుని, పట్టుని కోల్పోయేలా చేసుకున్నారు అని అంటున్నారు.

ఇవే కాదు గట్టిగా మాట్లాడకపోవడం, ధీటైన నేతగా జిల్లా రాజకీయాల్లోనైనా  ఫోకస్ కాలేకపోవడం కూడా రాధాలోని మైనస్ పాయింట్లుగానే చూస్తారు. అదే టైమ్ లో ఆయనకు గట్టిగా నిలబడే కార్యకర్తలు కూడా లేని లోటు ఉంది. నిజానికి ఏ నాయకుడికి అయినా హార్డ్ కోర్ క్యాడర్ ఎపుడూ అండగా ఉండాలి.

ఈ విషయంలో రాధాకు మాత్రం పెద్ద లోటే ఉందని అంటున్నారు. ఇక ఆయన ఆర్ధికంగా కూడా వీక్ గా ఉన్నారని అంటున్నారు. రాజకీయాలు ఇపుడు చూస్తే ఆర్ధికంగానే నడుస్తున్నాయి. డబ్బు ఉంటేనే పాలిటిక్స్ చేయాల్సిన పరిస్థితి. మరి రంగా వంటి బిగ్ షాట్ వారసుడిగా జనంలో నిలబడాలి అంటే సౌండ్ పార్టీగా ఉండాలి. రాధా విషయంలో అది కూడా సైలెంట్ కావడంతోనే ఆయన దూకుడు చేయలేకపోతున్నారు అని అంటున్నారు.

ఇక మాజీ మంత్రి కొడాలి నానిని చూస్తే ఆయన టీడీపీని బాబును  తిడతారు కానీ ఎన్టీయార్ భక్తుడిగా నిత్యం పూజిస్తారు. అలా హార్డ్ కోర్ ఎన్టీయార్ ఫ్యాన్స్ కి ఆరాధ్య నాయకుడు అయ్యారు. ఇక డెసిషన్ తీసుకుంటే గట్టిగా నిలబడతారు. అలాగే ఆయన రైటో రాంగో తాను గట్టిగా మాట్లాడేస్తూంటారు.

ఆయన టార్గెట్ కూడా వేరు అని అంటారు. ఏపీలో కమ్మ సామాజికవర్గానికి పవర్ ఫుల్ మాస్ లీడర్ ఇపుడు కావాలి. దాని కోసమే కొడాలి ప్రిపరేషన్ అంతా అని అంటారు. ఆయన మంత్రిగా చేశారు, ఆర్ధికంగా కూడా బాగా ఉన్నారు. వరసబెట్టి గుడివాడలో నాలుగు సార్లు గెలిచి కంచుకోటను చేసుకున్నారు. కాపులతో ఇతర సామాజిక వర్గాలతో  సఖ్యత కొనసాగిస్తూ తన విజయానికి ఢోకా లేకుండా చేసుకుంటున్నారు. ఈ డైనమిజం ఉండడమే కొడాలి నానికి ప్లస్ అవుతోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.
Tags:    

Similar News