కొడాలి స‌హా అంద‌రికీ.. వంగ‌వీటి రాధా.. బిగ్ షాక్‌

Update: 2022-12-26 17:49 GMT
తాజాగా ఏపీని కుదిపేస్తున్న వంగ‌వీటి రాధా రాజ‌కీయం.. రంగా హ‌త్య వంటి ప‌రిణామాల‌పై రంగా త‌న‌యుడిని వెనుకేసుకు వ‌స్తూ.. ఆయ‌న మా త‌మ్ముడు.. అని కామెంట్స్ చేసిన మాజీ మంత్రి వైసీపీ నాయ‌కుడు కొడాలి నాని.. స‌హా.. రంగా త‌మ వాడ‌ని చెప్పుకొనే.. వైసీపీ నేత‌ల‌కు రంగా త‌న‌యుడు, మాజీ ఎమ్మెల్యే రాధా బిగ్ షాక్ ఇచ్చారు. రంగా హ‌త్య కేసులో టీడీపీని త‌ప్పుగా అర్ధం చేసుకున్నాన‌ని అన్నారు. నిజానికి ఆదివారం, సోమ‌వారం కూడా రంగా చూట్టూ గుడివాడ రాజ‌కీయం తిరిగింది.

టీడీపీని త‌ప్పుబడుతూ.. వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు. రంగాను చంపింది.. టీడీపీ నేత‌లేన‌ని వారే ఇప్పుడు ఆయ‌న విగ్ర‌హానికి దండేసి దండం పెడుతున్నార‌ని విమ‌ర్శించారు. అంతేకాదు.. రాధా త‌మ త‌మ్ముడ‌ని చెప్పారు. టీడీపీ నేత‌ల‌కు రంగా బూట్లు నాకే అల‌వాటు ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చింద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా  వంగవీటి రాధ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయ‌కుల‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు.

టీడీపీనే త‌న తండ్రిని హ‌త్య‌చేయింద‌ని.. అప్ప‌ట్లో తాను, త‌న అనుచ‌రులు అనుకున్నామ‌ని.. అయితే.. ఎవ‌రో చేసిన త‌ప్పున‌కు పార్టీ మొత్తాన్ని నిందించ‌డం త‌న‌కు బాధేసింద‌ని అన్నారు.  “మా నాన్నగారిని టీడీపీనే హత్య చేయించిందని పదేపదే వాదించాం.  అయితే మా నాన్నగారికి అన్ని పార్టీలలో అభిమానులు ఉన్నారు.

టిడిపిలో నాన్నగారి అభిమానులు కొందరు నన్ను కలిసినప్పుడు, ‘అన్నా… పార్టీలో ఎవరో కొందరు చేసిన తప్పుకి మా అందరినీ నిందించడం… ఆ నిందని మా అందరికీ ఆపాదించడం నీకు తగునా?’ అని ప్రశ్నించార‌ని తెలిపారు.

అప్పుడు తాను త‌న త‌ప్పును గ్ర‌హించాన‌న్నారు. అప్ప‌ట్లో చిన్న‌పాటి ఆవేశంలో టీడీపీని నిందించామ‌న్నారు. అది త‌ప్ప‌ని తెలిసి.. బహిరంగంగానే ఆ తప్పుని ఒప్పుకొని సరిదిద్దుకొంటున్నానని చెప్పారు. ఇక‌, వైసీపీ త‌న‌కు అనేక ప‌ద‌వులు ఆఫ‌ర్ చేసింద‌న్నారు. . నాకు త‌న‌కు పదవులు, అధికారంపై వ్యామోహం లేద‌ని రాధా చెప్పారు.  మొత్తానికి తాజాగా రంగా హ‌త్య‌లో కి టీడీపీని లాగి రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌ని భావించిన వైసీపీకి.. ముఖ్యంగా కొడాలి నాని వంటివారికి బ‌ల‌మైన షాక్‌త‌గిలిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News

ఇక ఈడీ వంతు