పార్టీ మారుతున్న వంగ‌వీటి రాధా?.. వ‌ల్ల‌భ‌నేని వంశీతో రాయ‌`బేరాలు'?

Update: 2022-06-13 00:30 GMT
ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న వంగ‌వీటి రంగా కుమారుడు.. పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారా?  మ‌ళ్లీ త‌న పాత పార్టీ వైసీపీలోకే చేరాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారా? అంటే.. తాజాగా మారుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కృష్ణా జిల్లాలోని గన్నవరంలో వైసీపీ మద్దతుదారుడు, టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వంగవీటి రాధా ర‌హ‌స్యంగా భేటీ అయ్యారు. చాలా రోజుల తర్వాత వల్లభనేని వంశీ వంగవీటి రాధాను కలవడం ఆసక్తికరంగా మారింది. వారు ఏకాంతంగా చర్చించుకున్నట్లు సమాచారం. వంగవీటి రాధను దగ్గరుండి వంశీ కారులో ఎక్కించారు.

ఈ దృశ్యం మీడియా కంటపడింది. మీడియా వారిని ప్రశ్నించగా... స్నేహితులం కాబట్టే మాట్లాడుకున్నామని చెప్పినట్లు తెలిసింది. ఈ ఇద్దరి కలయికపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.  ఇదిలా వుండగా అప్పట్లో రంగా వర్ధంతి సందర్భంగా ఇద్దరూ కలుసుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నేత వంగవీటి రాధాను వల్లభనేని వంశీ విజయవాడలోని రాధా కార్యాలయం లో భేటీ అయ్యారు. అనంతరం వంగవీటి రంగా 33వ వర్థంతి సందర్భంగా బందరురోడ్డులోని ఆయన విగ్రహానికి రాధా, వంశీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ వంగవీటి రంగా ఆశయ సాధనకు కృషి చేస్తానని చెప్పారు. రంగా వర్థంతి సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. వంగవీటి రాధా టిడిపిలో ఉన్నారు. టిడిపి టిక్కెట్‌పై గెలిచిన వల్లభనేని వంశీ వైసిపిలో కొనసాగుతున్నారు. దీనిపై వంగవీటి రాధా, వల్లభనేని వంశీ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వంగవీటి రాధాకృష్ణ రాజకీయ పయనం ఎటువైపు. చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది.. సోషల్ మీడియాలో ఏదేదో ప్రచారం జరుగుతోంది.

2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరినా.. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అప్పుడప్పుడు అమరావతి రైతుల ఉద్యమం, ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతూ కనిపిస్తున్నారు.. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తాజాగా వంగవీటి రాధాను వల్లభనేని వంశీ కలవడం ఆసక్తికరంగా మారింది. వంగవీటి రాధా 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ పెద్దగా బయటకు రాలేదు. తర్వాత కొద్దిరోజులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలవడంతో ఆ పార్టీలోకి వెళతారనే ప్రచారం జరిగింది.

తర్వాత అమరావతి ఉద్యమం సమయంలో చంద్రబాబును విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేయడంతో.. రాధా చంద్రబాబు ఇంటికి వెళ్లి కలిశారు. తర్వాత అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇటీవ‌ల కాలంలో వైసీపీ నాయ‌కులు మాజీ మంత్రి కొడాలి నానితోనూ.. గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే టీడీపీ అస‌మ్మ‌తి ఎమ్మెల్యే వంశీతోనూ రాధా చ‌నువుగా ఉంటున్నారు. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో రాధా అడుగులువైసీపీ వైపు ప‌డుతున్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News