తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని కుటుంబాలు.. వంగవీటి, పరిటాల. దివంగత నేతలు వంగవీటి మోహన్ రంగా, పరిటాల రవిల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తాము జీవించి ఉన్నన్నాళ్లు ప్రత్యర్థులకు సింహస్వప్నంలా ఉన్నారు. కనుసైగలతో రాజకీయాలను శాసించారు.
ఈ నేతలు ఇద్దరూ దారుణ హత్యలకు గురయ్యారు. ఇప్పుడు వీరి వారసులు రాజకీయాల్లో ఉన్నారు. వారే వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ, పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్.
ఏపీలో రెండు ప్రధాన సామాజికవర్గాలకు చెందిన ఈ ఇద్దరు తాజాగా కలసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీరిద్దరూ ఎందుకు కలిశారనేదానిపై నెటిజన్లు, సాధారణ ప్రజల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
ఇద్దరు యువ నేతల భేటీ విషయానికొస్తే.. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు.. అమరావతి నుంచి అరసవెల్లి వరకు అనే పేరుతో మహా పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో రైతులకు తమ మద్దతు అందజేయడానికి వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్ అక్కడికి చేరుకున్నారు. వీరికి తోడు అక్కడ దివంగత లోక్‌సభ స్పీకర్ జిఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ కూడా రాధా, శ్రీరామ్‌లను కలిశారు. ఈ ముగ్గురు ఒక మంచంపై కూర్చొని నవ్వులు చిందిస్తూ మాట్లాడుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
రాజమండ్రిలో ఒక హోటల్‌లో వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్, గంటి హరీష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాధా, శ్రీరామ్ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది.
ఈ ఇద్దరు యువ నేతలు అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతు తెలçపడానికి వచ్చారు. ఈ క్రమంలోనే పాదయాత్రలో పాల్గొనేందుకు రాజమండ్రి వచ్చిన రాధా, శ్రీరామ్‌లు మరో యువనేత జీఎంసీ బాలయోగి తనయుడు హరీశ్‌తో భేటీ అయ్యారు.
గతంలో వంగవీటి రాధకు పరిటాల శ్రీరామ్ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. రాధాను చంపడానికి రెక్కీ జరిగిందన్న వార్తల నేపథ్యంలో శ్రీరామ్ అప్పట్లో తీవ్రంగా స్పందించారు. రాధాను ఎవరైనా టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ యువ నేతలు రాజకీయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందులోనూ ఇద్దరు నేతలు రెండు ప్రాధాన్యత కలిగిన కుటుంబాల నుంచి రావడం కూడా ఇందుకు దోహదం చేస్తుందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.