వంగవీటి రంగా తెలుగుదేశంలో చేరినప్పటి నుంచి తెలుగుదేశం నేతలు ఆయన సామాజిక వర్గం అంతా మా వైపే చేరిపోయిందన్నట్లు భావించారు. పలువురు ఇలా స్పందించారు కూడా. అయితే, వారివి భ్రమలే అని తాజా సంఘటన చెబుతోంది. ఆ సామాజిక వర్గం తెలుగుదేశంలో చేరడం చేరకపోవడం తర్వాత... అసలు వారు రంగా వైపే లేరా? అనే కొత్త అనుమానం కలిగేలా చేశారు... మండపేట మండలం కేశవరం గ్రామస్థులు.
విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే - కాపు నేత వంగవీటి రాధాకు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేశవరంలో ప్రచారం చేద్దామని వెళ్తే ఘోర పరాభవం ఎదురైంది. బుధవారం రాత్రి మండపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి - సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తరఫున ఆయన ప్రచారం చేద్దామని వెళ్లారు. కేశవరంలో కాపు సామాజిక వర్గం బాగా ఎక్కువ. రాధ వస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు ఆయనను అడ్డుకున్నారు. ‘రాధాకృష్ణ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. వారు ఏ స్థాయిలో వ్యతిరేకించారు అంటే... పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది.
వారు ఏ సమస్య గురించో ఆయనను నిరసించలేదు. అసలు తండ్రిని చంపిన పార్టీలో చేరడమే కాకుండా ఆ పార్టీకి మద్దతు ఇస్తావా? అంటూ వారు మండిపడ్డారు. అదనపు బలగాలు అవసరం పడ్డాయి..
వంగవీటి పర్యటనలో పరిస్థితి అదుపు తప్పిందని తెలిసి పోలీసులు వచ్చారు. అయితే, అక్కడికి వచ్చాక ఆందోళన తీవ్ర స్థాయిలో ఉందని అర్థమై అనపర్తి - రామచంద్రపురం ల నుంచి అదనపు బలగాలను రప్పించారు. మండపేట రూరల్ సీఐ లక్ష్మణరెడ్డి ఆందోళన కారులతో మాట్లాడారు. అయినా వారు నిరసన ఆపలేదు. దీంతో రంగా వెనుదిరగాల్సి వచ్చింది. వెళ్తూ వెళ్తూ...మీరు నా మీద ఎంత ద్వేషం పెంచుకున్నా ఫర్వాలేదు: అంతే ప్రేమ - ఆప్యాయత - అనురాగం రంగా మీద చూపించాలని - అది తనకు చాలని రాధా పేర్కొన్నారు. అనంతరం ఆయనను అక్కడి నుంచి రాజమహేంద్రవరం వైపు పోలీసులు పంపించి వేశారు.