టిట్ ఫర్ టాట్.. రాధా ఔట్.. దేవినేని ఇన్?

Update: 2019-01-24 05:35 GMT
బెజవాడ పాలిటిక్స్ రసకందాయంలో పడుతున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి ఈనెల 25న టీడీపీలో చేరుతున్న వంగవీటి రాధాను కొందరు టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని కూడా తెలిసింది. దీంతో రాధా ఫ్యామిలీతో ఏళ్లుగా శత్రుత్వం పెంచుకున్న దేవినేని ఫ్యామిలీ ఈ పరిణామాలను జీర్ణించుకోవడం లేదట.. ముఖ్యంగా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న దేవినేని అవినాష్ రాధా రాకను ఆపలేకపోతున్నారట.. ఆయన వైసీపీలో జంప్ చేసేందుకు సిద్ధమవుతున్నారని బెజవాడ రాజకీయాలనుంచి వార్తలొస్తున్నాయి..

వంగవీటి, దేవినేని ఫ్యామిలీలకు కృష్ణ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా వైరం ఉంది. హత్యలు, హత్యాకాండలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు రాధా అవన్నీ మరిచిపోయి టీడీపీలోకి రావడం ఆయన అభిమానులను, కార్యకర్తలను విస్మయానికి గురిచేస్తోంది. అవినాష్ కు న్యాయం చేస్తానని చంద్రబాబు ప్రకటించారట.. గుడివాడ సీటు ఇస్తానని బాబు చెప్పగా.. నూజివీడుపై ఆసక్తితో అవినాష్ పనిచేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు రాధా రాకతో వైసీపీలోకి జంప్ చేసేందుకు అవినాష్ రెడీ అవుతున్నట్టు వార్తలొస్తున్నాయి..

దేవినేని అవినాష్ కు వైసీపీ విజయవాడ ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా వైసీపీకి విజయవాడ ఎంపీ సీటులో సరైన అభ్యర్థి కోసం శూలశోధన చేస్తున్నారు. ఇప్పుడు అవినాష్ తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని వైసీపీ యోచిస్తోందట.. రాధా టీడీపీలోకి వెళ్లగానే ఆయన స్థానాన్ని  భర్తీ చేసేందుకు వైసీపీ పెద్దలు అవినాష్ కు గాలం వేస్తునట్టు ప్రచారం జరుగుతోంది. శత్రువు టీడీపీలోకి చేరిన నేపథ్యంలో తన సీటుపై హామీ ఇవ్వని బాబుకు అవినాష్ జలక్ ఇచ్చి వైసీపీలో చేరుతారా? లేదా కొనసాగుతాడా అన్నది వేచిచూడాల్సిందే..


Full View
Tags:    

Similar News