వంగవీటి రాధా. విజయవాడకు చెందిన రంగా కుమారుడు. 2019 ఎన్నికల్లో ఈయన సెంట్రిక్‌గా వైసీపీ రాజకీ యాలు వేడెక్కాయి. తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గమే కావాలని.. ఆ ఎన్నికల్లో పట్టుబట్టారు. అయితే.. `ఇది తక్క` అంటూ.. అప్పట్లో ఆయన ఉన్న వైసీపీ ప్రతిపాదించింది. అయితే..తనకు అదే కావాలని పట్టుబట్టారు. ఈ క్రమంలోనే పార్టీపై అలిగి..ఆయన బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీలో చేరారు. ఇప్పుడు ఇదే సీన్.. పొరుగున ఉన్న చిన్న రాష్ట్రం గోవాలో కనిపిస్తోంది.
రాధా ప్లేస్‌లో ఇక్కడ గోవా మాజీ సీఎం, దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ ఉన్నారు. ఇక, వైసీపీ స్థానంలో బీజేపీ ఉంది. ఇక, రాజకీయం సేమ్ టు సేమ్. అప్పుడు ఏపీలో ఏం జరిగిందో ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఉత్పల్ ఒక నియోజకవర్గం కోసం పట్టుబడుతుంటే.. దానిని ఇచ్చేది లేదని.. మరెక్కడ నుంచి పోటీ చేసినా.. ఓకే చెబుతామని..బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామం.. ఇప్పుడు గోవా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారడం విశేషం. మరోవైపు.. ఉత్పల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. గతంలో తన తండ్రి పోటీ చేసిన పణజీ స్థానమే కావాలని కోరుకుంటున్నారు.
ఇదిలావుంటే, మరోవైపు ఉత్పల్ పారికర్కు బీజేపీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితాలో ఆయనకు చోటు కల్పించలేదు మొత్తం 40 సీట్లకు గాను 34 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ.. ఉత్పల్కు టికెట్ ఇవ్వకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. పారికర్ కుటుంబం ఎల్లప్పుడూ మన కుటుంబమే. కానీ, ఉత్పల్ పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గంలో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టటం సరైనది కాదు. ఉత్పల్కు పోటీ చేసేందుకు మరో రెండు స్థానాలను సూచించాం. దానిని ఆయన తిరస్కరించారు. ఉత్పల్తో చర్చలు కొనసాగుతున్నాయి అని ఇక్కడి బీజేపీ ఇంచార్జ్ ఫడణవీస్ అన్నారు.
ఇదిలావుంటే, ఉత్పల్ పారికర్ తమ పార్టీలో చేరాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు . 'పారికర్ కుటుంబంతో కూడా బీజేపీ యూజ్ అండ్ త్రో పాలసీని అవలంబించటంపై గోవా ప్రజలు బాధపడుతున్నారు. మనోహర్ పారికర్ను నేను గౌరవిస్తూనే ఉంటాను. మా పార్టీలో చేరాలని ఉత్పల్కు స్వాగతం పలుకుతున్నాం. ఆప్ టికెట్పై పోటీ చేయాలని కోరుతున్నాం.' అని పేర్కొన్నారు. దీంతో ఏం జరుగుతుందో అనే టెన్షన్ పొలిటికల్ సర్కిళ్లలో కొనసాగుతుండడం గమనార్హం.