వంటేరు ఒంట‌రి అవ‌క త‌ప్ప‌దా?

Update: 2018-11-09 09:16 GMT
గ‌జ్వేల్ ... ఒక ముఖ్య‌మంత్రి నియోజ‌క‌వ‌ర్గం. సాధార‌ణంగా ఎక్క‌డైనా ఒక ముఖ్య‌మంత్రి పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగోసారో ఐదోసారో ఓడిపోవ‌డం జ‌రుగుతుంటుంది కానీ రెండోసారి ఎవ‌రూ ఓడిపోరు. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల కంటే ఒక ముఖ్య‌మంత్రి నియోజ‌క‌వ‌ర్గం ఎపుడూ అభివృద్ధిలో ముందే ఉంటుంది. గ‌జ్వేల్ ప‌రిస్థితి కూడా అదే. నియోజ‌క‌వ‌ర్గం ఏర్పాటు అయిన‌ప్ప‌టి నుంచి 2014 వ‌ర‌కు అక్క‌డ జ‌రిగిన అభివృద్ధి వెయ్యి కోట్లు. కానీ కేసీఆర్ నాలుగేళ్ల‌లోనే 6 వేలు కోట్లు ఖ‌ర్చుపెట్టారు. గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెట్టిన వారు ఆ రోడ్లు - భ‌వ‌నాలు - కాలేజీలు - మంచి నీటి స‌ర‌ఫ‌రా ఇవ‌న్నీ చూస్తే ఇండియాలో గ్రామాలు ఇంత అభివృద్ధి చెందాయా అన్న అనుమానం క‌ల‌గ‌క‌మాన‌దు. ఏ ప్ర‌జ‌లైనా త‌మ‌కు ముఖ్య‌మంత్రి వ‌ద్దు.. అనుకోరు క‌దా. గ‌జ్వేల్ ప్ర‌జ‌ల అభిప్రాయం కూడా అదే. మ‌ళ్లీ కేసీఆర్‌ కే ఓటు అనే కాదు, వారు రాష్ట్రంలో మ‌ళ్లీ గెలుస్తారు అని అనుకుంటున్నారు.  ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌ బాబు మ‌హాకూట‌మిలో క‌ల‌వ‌డంతో ఇంత‌కాలం అద్భుతంగా క‌నిపించిన గ‌జ్వేల్ చంద్రబాబు అనుకూల మీడియాకు ఇపుడు అధ్వానంగా క‌నిపిస్తోంది. వాళ్లు చంద్రబాబు క‌ళ్ల‌తో గ‌జ్వేల్‌ ను చూడ‌టం మొద‌లుపెట్టారు. ఆ మీడియా  గాలి లెక్క‌లు ఎలా ఉన్నాయంటే... గ‌తంలో వంటేరు టీడీపీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి న‌ర‌సారెడ్డి పోటీ చేశారు. ఇపుడు ఆ ఇద్ద‌రు క‌లిశారు కాబ‌ట్టి ఆ ఓట్ల‌న్నీ క‌లిపితే కేసీఆర్ కంటే ఎక్కువొస్తాయి అన్న‌ది వారి లెక్క‌. ఇలా ఎక్క‌డ‌యినా జ‌రుగుతుందా?

2014లో కేసీఆర్ సీఎం అవుతారో అవ్వ‌రో తెలియ‌దు. అప్ప‌టి లెక్క‌ల ప్ర‌కారం టీడీపీ బ‌లంగా ఉంది. పైగా తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది. కేసీఆర్‌ కు అది కొత్త నియోజ‌క‌వ‌ర్గం. కాబ‌ట్టి త‌క్కువ మెజారిటీతో కేసీఆర్ గెలిచారు. మ‌రి ఈసారీ అలా ఉండే అవ‌కాశం లేదు. ఎందుకంటే గ‌తంలో గ‌ట్టి పోటీ ఇచ్చిన టీడీపీ తెలంగాణ‌లో ఇపుడు అదృశ్యం. కేవ‌లం హైద‌రాబాదులోని కొన్ని ప్రాంతాల్లో కొన ఊపిరితో బ‌తికిఉంది. చంద్ర‌బాబుతో క‌ల‌వ‌డంతో మ‌హాకూట‌మి ప్ర‌భ త‌గ్గింది. పైగా త‌మ ఎమ్మెల్యే సీఎం కావ‌డం వ‌ల్ల కొత్త రోడ్లు - కొత్త స్కూళ్లు..ర‌క‌ర‌కాల ప‌థ‌కాలు జ‌నం చేతినిండా డ‌బ్బు. ఇవ‌న్నీవ‌దులుకోవ‌డానికి ఏ ప్ర‌జ‌లు మాత్రం సిద్ధంగా ఉంటారు? ఈ క‌నీస అంచ‌నా లేకుండా గాలి వార్త‌లు అల్లితే ఏం ప్ర‌యోజ‌నం. ఈ వార్త‌లు న‌మ్మి ప్ర‌గ‌ల్బాలు ప‌లుకుతున్న వంటేరు ఎన్నిక‌ల‌య్యాక ఒంట‌రిగా మిగ‌ల‌క త‌ప్ప‌దు.
   

Tags:    

Similar News