ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు సతీమణిని ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. రాజకీయ దుమారానికి తెర తీసింది. సరికొత్త రాజకీయ రగడగా మారిన ఈ ఉదంతంలో పలువురు నేతలు.. నందమూరి కుటుంబం స్పందించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మిగిలిన వారికి భిన్నంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఉందని.. సొంత కుటుంబానికి చెందిన వ్యక్తిపై అంతలా మాట అంటే.. ఘాటుగా రియాక్టు కాకుండా.. ఏదో స్పందించామంటే స్పందించామన్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్ ఉందన్న విమర్శ ఉంది.
ఇదే విషయాన్ని తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ తో తన సతీమణితో కలిసి ఆయన పన్నెండు గంటల దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వర్ల నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీఆర్ ఫెయిల్ అయ్యారన్న వర్ల రామయ్య.. మేనత్తును నోటికొచ్చినట్లుగా అంటే మేనల్లుగా జూనియర్ ఎన్టీఆర్ సరిగా స్పందించలేదన్నారు. ఈ విషయాన్ని తాను అనటం లేదని.. ప్రజలే అంటున్నారన్నారు. సినిమాల కోసం కుటుంబాన్ని నైతిక విలువలను వదులుకుంటారా? అని ప్రశ్నించిన వర్ల వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే.. వర్ల వ్యాఖ్యల్ని మిగిలిన టీడీపీ నేతలు స్పందించారు. మేనత్త మీద చేసిన వ్యాఖ్యలపై మేనల్లుడిగా జూనియర్ ఎన్టీఆర్.. సింహాద్రిలానో.. ఆదిలానో స్పందిస్తారనుకుంటే.. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల మాదిరి వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. బూతుల మంత్రి కొడాలి నానికి ఎన్టీఆర్ అంటే భయమన్నారు.ఆయన్ను ఎన్టీఆర్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. మేనత్త భువనేశ్వరిపై కొడాలి నాని.. వల్లభనేని వంశీలు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు ఏ మాత్రం సరిగా లేదన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పైన వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు బుద్దా వెంకన్న.. నాగుల్ మీరాలు సమర్థించారు. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యల్ని చూసి వైసీపీ నేతలే.. జూనియర్ ఎన్టీఆర్ ఇలా మాట్లాడారని అనుకుంటున్నారన్నారు. వర్ల రామయ్య మనసులో మాటే కాదు.. తెలుగు ప్రజలందరిది ఇదే భావన అన్నారు. మేనత్తపై వైసీపీ నేతలే నీచమైన భాష మాట్లాడినా ఎన్టీఆర్ స్పందించిన తీరు మాత్రం తమను బాధిస్తోందన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అసలు నందమూరి సంబంధించిన వ్యక్తిలా రియాక్టు కాలేదన్నారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ లో జూనియర్ ఎన్టీఆర్ తీరును తప్పు పడుతున్న వైనంపై ఆయన ఎలా రియాక్టు అవుతారన్నది ఒక ప్రశ్న. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. ఆయన సతీమణి.. పిల్లలు వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లటం తెలిసిందే.