త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.వైసీపీ తరఫున మాజీ మంత్రలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పారిశ్రామికవేత్తలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీలు ఏపీ నుంచి రాజ్యసభ బరిలో ఉన్నారు. వైసీపీకి ఉన్న సభ్యుల పరంగా దాదాపుగా వీరి ఎంపిక లాంఛనమే. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల బరిలో టీడీపీ తరఫున అభ్యర్థిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. తమ పార్టీ తరఫున వర్ల రామయ్యను రాజ్యసభ బరిలో నిలుపుతున్నామని చంద్రబాబు ప్రకటించారు.
ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలనుద్దేశించి చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఓటు వేసేముందు వైసీపీఎమ్మెల్యేలు ఒక్కసారి ఆలోచించాలని చంద్రబాబు సూచించారు.తాము తప్పు చేస్తున్నామో, ఒప్పు చేస్తున్నామో వైసీపీ ఎమ్మెల్యేలు తెలుసుకోవాలని..తప్పని భావిస్తే వర్ల రామయ్కుయ ఓటెయ్యాలని బాబు సూచించారు. ఒకవేళ తప్పని తెలిసినా భయపడితే వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తారని అన్నారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేస్తామని, పార్టీ ఏజెంట్ కు చూపించి ఓటేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే అనర్హత వేటు పడుతుందని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.