ఈ గాంధీని తట్టుకోవడం కష్టమే గురూ ... ?

Update: 2022-02-23 03:30 GMT
బీజేపీ నేతలు తెల్లారిలేస్తే చాలు నెహ్రూ గాంధీ ఫ్యామిలీ అంటీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తారు. అసలు గాంధీ ఫ్యామిలీ వల్లనే దేశం బాగా వెనక్కుపోయిందని కూడా ఆరోపణలు చేస్తారు. ఒక విధంగా గాంధీ ఫ్యామిలీని ఎంతగా టార్గెట్ చేస్తే అంతలా తమకు రాజకీయ ప్రయోజనం చేకూరుతుంది అన్నది బీజేపీ నేతల ఫిలాసఫీ.

అయితే గాంధీల్లో తమకు నచ్చిన గాంధీగా మేనకా గాంధీని పాతికేళ్ల క్రితం తెచ్చి పెట్టుకుని కాషాయ తీర్ధం ఇచ్చారు. ఇక ఆమె కుమారుడు వరుణ్ గాంధీని కూడా ఎంపీని చేసి తమకూ ఒక గాంధీ ఉన్నాడు అనిపించుకున్నారు. అయితే అన్నీ బాగా ఉంటేనే బంధాలు బాగుంటాయి. రాజకీయ బంధాలు అయితే  తేడా వస్తే  ఇట్టే పుటుక్కున తెగిపోతాయి.

అలా వరుణ్ గాంధీ ఇపుడు బీజేపీకి అడ్డం తిరుగుతున్నారు. ఆయన గత కొంతకాలంగా పార్టీ లైన్ కి భిన్నంగా వెళ్తున్నారు. అంతే కాదు తాను ఏదనుకుంటే అది చేస్తున్నారు. బోల్డ్ గా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. అవన్నీ బీజేపీ పెద్దలకు తలనొప్పులుగా మారుతున్నాయి. దాంతో బీజేపీలో వరుణ్ గాంధీ ప్రయారిటీని బాగా తగ్గించేసారు కమలనాధులు.

తాజాగా జరుగుతున్న యూపీ ఎన్నికల్లో స్టార్ కాంపెయినర్ల జాబితాలో వరుణ్ పేరు లేదు, అలా ఆయనకు షాట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. దాంతో మరింత రగిలిపోతున్న వరుణ్ ఇక మీదట  తనకు వేరేగా  పోయేదేముందు అన్న తీరుగా పార్టీలో ఉంటూనే బాగానే  పొగపెడుతున్నారు. ట్విట్టర్ వేదికగా వరుణ్ సొంత పార్టీ మీద ప్రభుత్వం మీద చేస్తున్న ఘాటు వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి.

ఒక పక్కన చావో అన్నట్లుగా సాగుతున్న యూపీ ఎన్నికల వేళ ఈ జూనియర్ గాంధీ ఇలా బీజేపీ విధానాల మీద విరుచుకుపడుతూండడంటో డ్యామేజ్ కంట్రోల్ చేసుకోలేక పార్టీ నేతలు ముప్పతిప్పలు పడుతున్నారు. తాజాగా వరుణ్ గాంధీ తన ట్విట్టర్ ద్వారా మోడీ పాలన మీద నిప్పులే చెరిగారు.

అన్నీ ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతే పబ్లిక్ ఏం కావాలి అంటూ ఆయన సూటిగానే మోడీని ప్రశ్నించారు. ప్రైవేట్ రంగంలోకి అన్నీ తెచ్చేస్తే దాని మీద ఆధారపడి ఉన్న వారు ఏం కావాలని కూడా ఆయన నిలదీస్తున్నారు. ఇప్పటికే బ్యాంకులు, రైల్వేల‌ను ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీని వల్ల అయిదు లక్షలకు పైగా ఉద్యోగాలు కోల్పోతారు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకరికి ఉద్యోగం పోతే ఆయన మీద ఆధారపడి కుటుంబ సభ్యులంతా రోడ్డున పడతారు అని ఆయన అన్నారు. ప్రభుత్వాలు ఆర్ధిక అసమానతలు లేకుండా పాలించాలని, కానీ వారే వాటిని క్రియేట్ చేస్తే ఎలా అని కూడా వరుణ్ లాజిక్ గానే మోడీ సర్కార్ ని టార్గెట్ చేశారు. ప్రజా సంక్షేమ ప్రభుత్వాలు పెట్టుబడిదారులను ప్రోత్సహించవు అని చెప్పడం ద్వారా మోడీ సర్కార్ ప్రజా సంక్షేమ ప్రభుత్వం కాదని కూడా తేల్చేశారు.

మొత్తానికి వరుణ్ గాంధీ సొంత పార్టీలో ఉంటూ చేస్తున్న విమర్శలను బీజేపీ పెద్దలు అసలు ఏ కోశానా  జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగని ఆయనని ఏమీ అనలేకపోతున్నారు. బయట కాంగ్రెస్ గాంధీలను ఏదో విధంగా ఇరుకున పెడుతూ తమ రాజకీయ రధాన్ని సాఫీగా ముందుకు తీసుకుపోతున్న బీజేపీ నేతలకు వరుణ శాపం మాత్రం గట్టిగానే తగిలేట్టుంది అంటున్నారు.
Tags:    

Similar News