త‌ల్లి చేసిన డ్యామేజ్ ను కొడుకు కంట్రోల్ చేశాడే!

Update: 2019-04-22 05:28 GMT
ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో ద‌ర్శ‌మిస్తున్న త‌ల్లీకొడుకుల వ్య‌వ‌హారంగా దీన్ని చెప్పాలి. సంచ‌ల‌న వ్యాఖ్య‌లతో పాటు.. అప్పుడ‌ప్పుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌నిది పొద్దుపొడ‌వ‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే బీజేపీ నేత‌ల్లో కేంద్ర‌మంత్రి మేన‌కాగాంధీ.. ఆమెకుమారుడు వ‌రుణ్ గాంధీలు ముందుంటారు. తాజాగా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా వీరు చేసిన వ్యాఖ్య‌లు వార్త‌ల్లో ప్ర‌ముఖంగా ద‌ర్శ‌న‌మిచ్చాయి.

ఈ మ‌ధ్య‌నే మేన‌కాగాంధీ మాట్లాడుతూ.. త‌న‌కు ఓటు వేయ‌ని వారికి ప‌ని చేసేది లేదంటూ.. ముస్లింల‌కు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇలాంటి వేళ‌.. వ‌రుణ్ గాంధీ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఫిలిబిత్ నియోజ‌క‌వ‌ర్గంలోని సుల్తాన్ పూర్ ప‌ట్ట‌ణంలో జ‌రిగిన ర్యాలీలో పాల్గొన్న వ‌రుణ్.. త‌న‌కు ముస్లింలు ఓట్లు వేయ‌కున్నా..వారికి తాను ప‌నులు చేస్తాన‌ని చెప్పారు. ఆ మ‌ధ్య త‌న త‌ల్లి చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో జ‌రిగిన డ్యామేజ్ ను త‌గ్గించే ప్ర‌య‌త్నాన్ని తాజాగా షురూ చేశారు వ‌రుణ్ గాంధీ.

తాను ఒక్క విష‌యాన్ని ముస్లిం సోద‌రుల‌కు చెప్ప‌ద‌లుచుకున్నాన‌ని..  త‌న‌కు ఓటు వేస్తే బాగుంటుంద‌ని.. ఒక‌వేళ త‌న‌కు ఓటు వేయ‌కున్నా త‌న‌తో ప‌నులు చేయించుకోవ‌చ్చంటా ఆయ‌న ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లు చేశారు. మీరు నాకు ఓటు వేయ‌కున్నా నాతో ప‌నులు చేయించుకోవ‌చ్చు.. ఈ విష‌యంలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ వ‌రుణ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.
Tags:    

Similar News