విమర్శలకు అబ్బాయ్ తలొగ్గాడు. హోరాహోరీగా ఎన్నికల సమరం సాగుతుంటే.. షూటింగ్ హడావుడిలో ఉన్నానంటూ ఫారిన్ వెళ్లిపోయిన అబ్బాయ్ వరుణ్ తేజ్ తిరిగి వచ్చేశాడు. అదే పనిగా సాగుతున్న విమర్శలతో తండ్రికి దన్నుగా నిలుస్తూ.. బాబాయ్ ను పొగిడేస్తూ వరుణ్ తేజ్ ప్రచార బరిలోకి దిగాడు.
నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థిగా నాగబాబు బరిలో నిలిచిన విషయం తెలిసిందే. పవన్ సోదరుడైన నాగబాబు ఎన్నికల బరిలో నిలిస్తే.. ఆయన తరఫున ప్రచారం చేయటానికి ఆయన కొడుకు.. మెగా హీరో వరుణ్ తేజ్ విదేశాలకు వెళ్లటం ఆసక్తికరంగా మారింది. ఓవైపు తండ్రి ఎన్నికల్లో కోట్లాడుతుంటే.. మరోవైపు కొడుకు షూటింగ్ లో బిజీ అని విదేశాలకు వెళ్లటంపై పలువురు విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో వరుణ్ పై భారీగానే ట్రోల్ జరిగింది.
వరుణ్ తేజ్ నటించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో తెలంగాణ కుర్రాడిగా నటించినవే ఉండటం గమనార్హం. తెలంగాణ యాసలో మాట్లాడే పాత్రల్ని నటించిన వరుణ్.. ఏపీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి.. తన తండ్రికి తోడుగా నిలిచేందుకు రాకపోవటం ఏమిటన్న ప్రశ్న అంతకంతకూ పెరిగింది. ఇదే సమయంలో వరుణ్ తేజ్ సోదరి.. సినీ నటి నిహారిక తండ్రికి తోడుగా నిలుస్తూ ప్రచారం చేశారు.
చెల్లెలు ప్రచారం చేసింది కానీ.. అన్న మాత్రం షూటింగ్ అంటూ ఫారిన్ లో ఉంటున్నాడే అన్న మాట పలువురి నోట వినిపించింది. విమర్శల తీవ్రత మరింత పెరిగితే మొదటికే మోసం వస్తుందని అనుకున్నారో.. లేదంటే నిజంగానే షూటింగ్ హడావుడి ముగిసిందో కానీ.. వరుణ్ మాత్రం తాజాగా నరసాపురం ఎంపీ స్థానం పరిధిలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.
తన తండ్రికి.. జనసేన అభ్యర్థులకు ఓట్లు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాబాయ్ పవన్ కల్యాణ్ ఆశయాలు చాలా గొప్పవని పొగిడారు. బాబాయ్ ది మంచి మనసని..ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే పవన్ రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి కమ్ తన తండ్రి నాగబాబుకు.. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కు ఓటు వేయాలంటూ ప్రచారం చేశారు. జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన ఏకైక మెగా హీరో వరుణ్ గా చెప్పాలి. తండ్రి కానీ ఎన్నికల బరిలో లేకుంటే వరుణ్ కూడా వచ్చేవాడన్న మాట వినిపిస్తోంది.