మెగా హీరో వరుణ్ తేజ్ ఈ మధ్య కొత్త సినిమాల విషయంలో ఆచితూచి అడుగేస్తున్నట్లు కన్పిస్తున్నాడు. ఎందుకంటే రీసెంట్ గా అంతరిక్షం, గడ్డలకొండ గణేష్, ఇప్పుడు చేస్తున్న బాక్సర్ సినిమాలను చూస్తే ఈజీగా అర్ధమవుతుంది. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పుడిప్పుడే కెరీర్ ని ఒక దశలోకి మలుచుకోవడానికి ట్రై చేస్తున్నాడు వరుణ్. ఇక తను చేస్తున్న ప్రస్తుత సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగనుందట. ఈ సినిమా వరుణ్ కి 10వ సినిమా. ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకునిగా పరిచయమవుతున్నాడు. అంతరిక్షం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కిరణ్ ఆ సినిమా టైంలోనే ఈ కథ చెప్పి ఒప్పించినట్లు సమాచారం. ఇక బాక్సింగ్ నేపథ్య సినిమా కాబట్టి వరుణ్ ఇప్పటికే విదేశాలకు వెళ్లి బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్నాడట.
వరుణ్ అన్నివిధాలా బాక్సర్ గా కనిపించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉండలేక బాక్సింగ్ బ్యాగ్‌పై పంచ్ ల వర్షం కురిపిస్తున్నాడు వరుణ్. ‘‘కొన్నిసార్లు బలహీనంగా అనిపించినప్పుడు నేను బ్యాగ్‌ను పంచ్ చేస్తాను’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో వరుణ్ బాగా దిట్టంగా కండలు పట్టి.. అసలు సిసలు బాక్సర్ లుక్ లో ఉన్నాడు. ఈ సినిమాను అల్లు బాబీ - ముద్ద సిద్దులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా తెలుగుతెరకు పరిచయం కానుంది. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. నిజానికి జూలై 30న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు కానీ.. ఈ లాక్‌డౌన్ కారణంగా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.