ప్రముఖులుగా చెలామణీ అయ్యేవారు తమ నోటి నుంచి వచ్చే మాటల విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ తరచూ వివాదాల్లో కూరుకుపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ తీరు సమాజానికి ఏ మాత్రం మంచిది కాదు.
ప్రజల్లో ప్రముఖులుగా పేరున్న వారు.. తమ ఇమేజ్ కు భిన్నంగా వ్యవహరించటం వల్ల కొత్త సమస్యల్ని కొని తెచ్చుకుంటున్న పరిస్థితి. తాజాగా తమిళ దర్శకుడు భాగ్యరాజ చేసిన వ్యాఖ్యలు పెనుసంచలనంగా మారటం తెలిసిందే. మహిళలు చనువిస్తేనే పురుషులు ఛాన్స్ తీసుకుంటున్నట్లుగా వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటికే పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా ఇమేజ్ తో పాటు.. ప్రస్తుతం ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న వాసిరెడ్డి పద్మ స్పందించారు. భాగ్యరాజ వ్యాఖ్యల్ని తీవ్రస్థాయిలో ఖండించారు. భాగ్య రాజ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని.. ఆయన మాటలు బాధ్యతారాహిత్యంతో ఉన్నట్లు చెప్పారు. మహిళలకు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడిన సదరు దర్శకుడ్నిచెప్పుతో కొట్టాలని ఫైర్ అయ్యారు.
వివాదానికి కేంద్రబిందువైన భాగ్యరాజా చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. సెల్ ఫోన్ వచ్చాక మహిళలు రెండేసి సిమ్ కార్డులు వాడుతున్నారని.. గతంలో కట్టుబాట్లకు లోబడి ఉండే మహిళలు ఇప్పుడు మారిపోయారన్నారు. ఇప్పుడు ఎక్కడ మహిళల్ని చూసినా సెల్ తో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారన్నారు. ఇల్లు.. రోడ్లు ఎక్కడైనా ఇదే పరిస్థితి అన్నారు.
అక్కడితో ఆగకుండా అత్యాచార ఘటనల్లో పురుషులదే తప్పు అనటం సరికాదని.. మహిళలకు బలహీనత ఉండటం వల్లే పురుషులు దాన్ని ఉపయోగించుకున్నట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పురుషుడిది తప్పు అయితే.. అందుకు అవకాశం కల్పిస్తున్న మహిళలది కూడా తప్పేనన్నారు. భాగ్యరాజా తన మాటల్ని వెనక్కి తీసుకోకుంటే.. ఆయనపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తానని హెచ్చరించారు వాసిరెడ్డి పద్మ. మరి.. దీనిపై భాగ్యరాజా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.