పనామా పేపర్స్ లో త్వరలో బాబు పేరొస్తుందట

Update: 2016-04-05 10:13 GMT
విదేశాల్లో నగదు దాచుకున్న వారి పేర్లను బహిర్గతం చేస్తున్న 'పనామా పేపర్స్'లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పేరు త్వరలో వస్తుందని వైకాపా జోష్యం చెబుతోంది. మంగళవారం ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ.. బాబు విదేశాల్లో ఆస్తులను దాచాడన్నది అందరికీ తెలిసిన సత్యమని, నల్లధనం దాచుకున్న వారిపై కేంద్రం విచారణ జరిపితే, ఆయన పేరూ బయటకు వస్తుందని అన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతి బాగోతం బట్టబయలు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలోనే చంద్రబాబు అవినీతిని తెహల్కా బయట పెట్టిందని గుర్తు చేసిన ఆమె, ఆయన పాపాలు త్వరలోనే బయటకు వస్తాయని అన్నారు. తెలంగాణ సర్కారు నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టులపై బాబు అభిప్రాయాన్ని చెప్పాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.

కాగా పనామా పేపర్ల నేపథ్యంలో చంద్రబాబుపై వైసీపీ... జగన్ పై టీడీపీ.. ఆరోపణలు చేసుకుంటాయని అంతా ఊహించే అయినా ఈ విషయంలో వైసీయే ముందు బయటపడింది. చంద్రబాబుపై ఆరోపణలకు దిగింది. అయితే.... ఎవరెన్ని ఆరోపణలు చేసుకున్నా పనామా పత్రాలు వంటి లీకుల్లో మన నేతల బాగోతాలు బయటపడే అవకాశాలు తక్కువే. ఎందుకంటే మన నేతలు, వ్యాపార ప్రముఖులు నల్లధనాన్ని దాచకోవడానికి ఇతర దేశాల కంటే ఇతర మనుషులను వెతుక్కుంటారు. ఇతర దేశాల్లో దాస్తే ఏమవుతుందో అన్న భయంతో ఇక్కడే దాస్తారు, పెట్టుబడులు పెడతారు. బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టి వారిని తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటారన్న సత్యం అందరికీ తెలిసిందే. కాబట్టి జగన్ పేరైనా... చంద్రబాబు పేరైనా... ఇంకెవరి పేరైనా కూడా ఇలాంటివాటిలో వచ్చే అవకాశాలు తక్కువే మరి.
Tags:    

Similar News