తల్లి కాంగ్రెస్.. పిల్ల కాంగ్రెస్ ఒకటేనని.. ఏ రోజుకైనా పిల్ల కాంగ్రెస్ వెళ్లి తల్లి కాంగ్రెస్ లో కలవటం ఖాయమని ఏపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ తీవ్రంగా విమర్శించి 24 గంటలు కూడా గడవకముందే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (ప్రత్యర్థులు పిల్ల కాంగ్రెస్ పిలుస్తుంటారు)కి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తల్లి కాంగ్రెస్ ను తీవ్రస్థాయిలో మండిపడటం ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ పార్టీని తిట్టే విషయంలో కాస్త అటూఇటూగా వ్యవహరించే ధోరణికి భిన్నంగా.. బండకేసినట్లుగా బాదేయటమే కాదు.. సూటి ప్రశ్నలతో వాసిరెడ్డి వారు ఉక్కిరిబిక్కిరి చేశారు.
కాంగ్రెస్ పార్టీ బతుకంతా పిల్ల టీడీపీలా బతకటమే తప్పించి.. మరోలా లేదని మండిపడ్డ ఆమె.. రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా విభజన చేసి.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగేటట్లు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఈ రోజున ఏ ముఖం పెట్టుకొని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నాని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ప్రశ్నాస్త్రాల్ని సంధించారు.
వైఎస్సార్ కుటుంబాన్ని అన్యాయంగా కేసుల్లో ఇరికించిన విషయాన్ని మర్చిపోయారా అంటూ ప్రశ్నించిన ఆమె.. ఇప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాని కి ఏ విధంగా పూలదండ వేస్తారని ప్రశ్నించారు. చార్జిషీట్ లో దివంగత నేత వైఎస్ పేరును చేర్చటాన్ని మర్చిపోయారా? అని అన్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలో కి రావటానికి కాంగ్రెస్ కారణం కాదా? అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓటుబ్యాంకును టీడీపీకి మళ్లించిన విషయం మర్చిపోయారా అంటూ ఊగిపోయారు. ఆమె ప్రశ్నల్లో క్లారిటీ కాస్త మిస్ అయినా.. కాంగ్రెస్ మీద తాము ఉడికిపోతున్నామని.. ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకుండా ఉండటానికి తల్లి కాంగ్రెస్ వైఫల్యమన్న మాట మాత్రం ఆమె విమర్శల్లో బలంగా వినిపిస్తోన్నట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.