ఆయన మంత్రా? మానసిక రోగా?

Update: 2016-12-14 11:27 GMT
ఏపీ ఇరిగేషన్ మినిష్టర్ దేవినేని ఉమపై వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఉమ అసలు మంత్రేనా మానసిక రోగా అని ఆమె ప్రశ్నించారు. అనుమానమే లేదని...  దేవినేని ఉమ మానసిక రోగిగా మారారని - మంత్రి స్థాయిలో ఆయన మాట్లాడటం లేదని పద్మ తీర్మానించేశారు.
    
హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో పద్మ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలపై మంత్రి ఉమ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. దేవినేని ఉమకు దమ్మూ ధైర్యం ఉంటే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పురోగతి 'ఇది' అని స్పష్టంగా చెప్పాలని, సమాధానం చెప్పకుండా పళ్లు కొరికితే సరిపోదని అన్నారు.
    
ఉమ ఇంటిపేరు దేవినేని కాదని.. ఆయన ఇంటిపేరు ‘అవినీతి’ అని పద్మ మండిపడ్డారు. నీటిపారుదల శాఖను అవినీతిపారుదల శాఖగా మార్చారని ఎద్దేవా చేశారు. చేతగానోడికి కోపమెక్కువ అన్నట్టుగా ఉమా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. దేవినేని ఉమకు చేతనైతే పోలవరం ప్రాజెక్టు కోసం నేరుగా కేంద్రం నుంచి నిధులు తేవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే తాము కోరుకుంటున్నామని, ఆ ప్రాజెక్టు.. వైఎస్ రాజశేఖరెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు అని  చెప్పారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News