పాత పెద్దనోట్లు స్వీకరించబడును.. రండి!

Update: 2016-11-10 22:14 GMT
గత రెండు రోజులుగా ముఖ్యంగా బుధవారం చేతిలో ఉన్న పాత పెద్ద నోట్లు మారక జనాలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఈ క్రమంలో "ఓన్లీ కార్డ్స్.. నో 500 అండ్ 1000 నోట్స్" అని, చాలా చోట్ల "500 - 1000 నోట్లు స్వీకరించబడవు" అని బోర్డులే కనిపించాయి. కానీ వీటికి భిన్నంగా "పాత పెద్ద నోట్లు స్వీకరించబడును" అని బోర్డులు పెట్టుకున్నారు విజయవాడలోని వస్త్ర వ్యాపారులు. కేంద్ర ప్రభుత్వం రూ.500 - రూ. 1000 నోట్లను ఉపసంహరించడంతో పెద్ద నోట్లు తీసుకునేందుకు అందరూ వెనుకాడుతుంటే విజయవాడ వస్త్ర వ్యాపారులు మాత్రం ఇందుకు భిన్నంగా ఇలా స్పందించారు.

వ​న్‌ టౌన్‌ లోని వస్త్రలత వ్యాపార సముదాయంలో పెద్ద నోట్లతో రండి దర్జాగా షాపింగ్‌ చేయండి అంటూ వినియోగదారులకు స్వాగతం పలుకుతున్నారు. అసలే పెళ్లిల్లు - శుభకార్యాల సీజన్ - చేతిలో ఉన్న నోట్లేమో చెల్లని పరిస్థితి... దీంతో వీరి ప్రకటనకు మంచి స్పందనే వచ్చిందనట. ఇక్కడ బట్టలు కొనేందుకు వినియోగదారులు భారీగా తరలివస్తున్నారురని ఇక్కడ వ్యాపారులు చెబుతున్నారు. దీంతో కొనుగోళ్లదారులతో వస్త్రలత వ్యాపార సముదాయం సందడిగా మారిందట.

ఈ విషయంపై స్పందించిన వ్యాపారులు... తమ షాపులో అన్నింటికీ బిల్లులు ఇచ్చి చట్టబద్దంగా వ్యాపారం చేస్తున్నాం కాబట్టి తమకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని  అంటున్నారట. అయితే.. వచ్చేనల 30 వరకు పెద్ద నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే వీలుండడం వీరి దీమాకు కారణమైవుండొచ్చు! మరోవైపు మిగతా ప్రాంతాల్లో దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News