నిను వీడని చీడను నేను అంటున్న లలిత్‌మోడీ

Update: 2015-07-08 11:24 GMT
రాజస్థాన్‌ సీఎం వసుంధర రాజెకు ఐపీఎల్‌ మాజీ చీఫ్‌ లలిత్‌ మోడీ కారణంగా మరోసారి ఇబ్బంది ఎదురైంది. లలిత్‌ మోడీకి పద్మశ్రీ ఇవ్వాలంటూ ఆమె గతంలో ప్రతిపాదించిన సంగతి వెలుగుచూడడంతో ఇరకాటంలో పడింది. క్రీడారంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని ఆమె ప్రతిపాదించారు. వసుంధర రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2007 జులై 28న కేంద్రానికి సిఫార్సు చేస్తూ లేఖ రాశారు. ఆ లేఖను క్రీడారంగానికి చెందిన అధికారుల ద్వారా ఆమె కేంద్రానికి చేరవేసిన సంగతి తాజాగా బయటపడింది.

    కేంద్రానికి రాసిన లేఖలో వసుంధర లలిత్‌ను ఎంత ప్రమోట్‌ చేయాలో అంతగా ప్రమోట్‌ చేశారు. ఆయన వ్యాపార రంగంలో, క్రీడారంగంలో చేస్తున్న సేవలను బాగా పొగిడారు. రాజస్తాన్‌ క్రీడాబోర్డును పరుగులు తీయిస్తున్నారంటూ ఆమె లలిత్‌ మోడీని వెనకేసుకొచ్చారట. ఆ తరవాత కాలంలో లలిత్‌ మోడీ వివాదాల్లో చిక్కుకోవడంతో ఆ వ్యవహారం అక్కడితో ఆగింది.. ఇటీవలే వసుంధర కుమారుడి సంస్థలో లలిత్‌ పెట్టుబడుల సంగతి బయటకు వచ్చి వివాదమేర్పడగా.. తాజాగా ఈసంగతి బయటపడడంతో వసుంధర రాజెకు కొత్త తలనొప్పి మొదలైంది.

Tags:    

Similar News