చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయేకానీ.. వాటి విషయంలో ప్రదర్శించే నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. శాంతంగా.. సౌమ్యంగా ఉన్నట్లుగా కనిపించే కన్నడిగులు.. తేడా వస్తే ఎంత ఉగ్రరూపం ప్రదర్శిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీర ప్రాంతీయ అభిమానాన్ని ప్రదర్శిస్తారని తమిళుల గురించి తరచూ చెప్పుకుంటారు కానీ.. వారికి మించిన ప్రాంతీయ భావనలు కన్నడిగులలో ఎక్కువగా ఉంటాయి.
అంతా బాగున్నప్పుడు చాలా చక్కగా ఉండే కన్నడిగులు..కోపం వచ్చినా..తమకు అన్యాయం జరిగిందని భావించినా వారిలోని వయలెంట్ కోణాన్ని చూడాల్సిందే. తమిళులకు.. కన్నడిగులకు పంచాయితీలు ఉన్నా.. ఆంధ్రులతో ఎలాంటి లొల్లి లేదన్న భావన ఉండేది. కానీ.. తాజాగా అలాంటిదేమీ లేదని..ఆంధ్రాలో తమ పట్ల తక్కువభావంతో చూస్తున్నారన్న ఫీలింగ్ కన్నడిగులలో మొదలు కావటం గమనార్హం.
కలియుగ వైకుంఠంగా కొలిచే తిరుమల కొండకు వచ్చే కన్నడిగుల పట్ల ఆంధ్రాకు చెందిన అధికారులు చిన్నచూపు చూస్తున్నారని.. కన్నడిగులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారంటూ కన్నడ పోరాట నేత వాటాళ్ నాగరాజ్ ఆరోపిస్తున్నారు. బెంగళూరు ప్రెస్ క్లబ్ లో తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో.. తాము ఆంధ్రప్రదేశ్ కు కానీ తిరుమల ఆలయానికి కానీ వ్యతిరేకం కాదని.. కర్ణాటక నుంచి వెళ్లే కన్నడ భక్తుల పట్ల టీటీడీ అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు.
కొండపై కన్నడిగులను తక్కువగా చూసే ధోరణిని టీటీడీలోని ఐఏఎస్ అదికారులు మార్చుకోకుండా ఈ నెల 16న ముళబాగిలు వద్ద నేషనల్ హైవేమీద బంద్ పాటిస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో ప్రముఖ కన్నడ సంఘాలన్నీ పాల్గొంటాయని ఆయన చెప్పారు. మైసూర్ మహారాజుల కాలంలో టీటీడీకి భారీగా ఆభరణాలు ఇచ్చారని.. కొండపై 7.5 ఎకరాల భూమి కూడా ఉందని.. దాన్ని కబళించే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. తిరుమలకొండపై కన్నడిగుల మర్యాదకు.. గౌరవానికి భంగం వాటిల్లేలా చూస్తే తాము సహించేది లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఇలాంటి పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఏ మాత్రంతేడా జరిగినా.. రెండు రాష్ట్రాల సంబంధాల మీద ప్రభావం పడుతుందన్న విషయాన్ని గుర్తించాలి. చిన్న సమస్యేనని తేలిగ్గా తీసుకుంటే మాత్రం..తగినమూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/