భార‌త్‌ తో వ్యాపారం బంద్‌ తో పాక్ విల‌విల‌...!

Update: 2019-08-12 04:34 GMT
భారత్‌ తో వాణిజ్య బంధానికి స్వస్తి పలికిన పాకిస్థాన్ దాని ఫలితం అనుభవిస్తోంది. భార‌త్ జ‌మ్మూ క‌శ్మీర్‌ కు కొన్ని ద‌శాబ్దాలుగా ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తిని క‌ల్పిస్తోన్న ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేయ‌డంతో దీనిని వ్య‌తిరేకిస్తూ పాక్ భార‌త్‌ పై త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కింది. అంత‌ర్జాతీయ స‌మాజం ముందు భార‌త్‌ను నిర్దోషిగా చేసేందుకు అటు అమెరికాతో పాటు ఇటు చైనా దేశాల‌కు భార‌త్‌ పై ఫిర్యాదు కూడా చేసింది. ఈ క్ర‌మంలోనే క‌శ్మీరీల‌కు మ‌ద్ద‌తుగా భార‌త్‌తో వాణిజ్య సంబంధాలు తెంచుకుంటున్న‌ట్ట కూడా ప్ర‌క‌టించింది.

అక్క‌డితో ఆగ‌కుండా భార‌త సినిమాలు పాక్‌లో ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దంటూ నిషేధం కూడా విధించింది. ఇక ఇమ్రాన్ భార‌త్‌తో ఇక‌పై తాము వ్యాపార కార్య‌క‌లాపాలు కొన‌సాగించ‌మ‌ని కూడా ప్ర‌క‌టించారు. దీనిని పాక్ మేథావులు సైతం త‌ప్పుప‌ట్టారు. పాక్ నిర్ణ‌యాల వ‌ల్ల భార‌త్‌కు జ‌రిగే న‌ష్టం త‌క్కువే అయినా పాక్‌లో సాధార‌ణ పౌరులు మాత్రం తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. భార‌త్‌ తో వ‌ర్త‌కం బంద్ ఎంత న‌ష్ట‌మో పాక్‌ కు కేవ‌లం వారం రోజుల్లోనే తెలిసి వ‌చ్చింది.

120 కోట్ల జ‌నాభా ఉన్న దేశానికి వ‌స్తువులు ఎగుమ‌తి చేసే అవ‌కాశం కోల్పోవ‌డంతో పాటు భార‌త్‌ ను నుంచి ప‌లు నిత్యావ‌స‌రాలు త‌క్కువ ధ‌ర‌కే దిగుమ‌తి చేసే అవ‌కాశం కూడా కోల్పోయారు. ఈ వారం రోజుల్లో అక్కడ కిలో టమాట రూ.300కి చేరిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గ‌త‌వారం కిలో ఆలుగ‌డ్డ రూ.10 ఉంటే ఇప్పుడు అది రూ.30కు చేరుకుంది. ఇదిలా ఉంట‌గే మ‌రో నాలుగైదు రోజులు దాటితే పాక్‌ లో కూర‌గాయ‌లు కూడా దొరికే ప‌రిస్థితి లేదు. దీంతో సామ‌న్య జ‌నాలు విల‌విల్లాడుతున్నారు.

భార‌త్ నుంచి పాకిస్తాన్ ప‌లు నిత్యావ‌స‌రాల‌తో పాటు కూర‌గాయాలు భారీగా దిగుమ‌తి చేసుకుంటోంది. ట‌మాటాలు - బంగాళాదుంప‌లు - ఉల్లిపాయ‌లు - సోయాబీన్స్‌ - పంచ‌దార‌ - ఆర్గానిక్ కెమిక‌ల్స్‌ - ప్లాస్టిక్ ఉత్ప‌త్తులు - దొండ‌కాయ‌లు త‌దిత‌ర వ‌స్తువులు త‌క్కువ రేటుకే దిగుమ‌తి చేసుకుంటోంది. భార‌త్ చాలా ద‌గ్గ‌ర‌గా ఉండ‌డంతో ర‌వాణా ఖ‌ర్చులు కూడా త‌క్కువ కావ‌డంతో ఇవి పాక్‌ లో చాలా త‌క్కువ రేటుకే దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇత‌ర దేశాల నుంచి దిగుమ‌తి చేసుకోవాల‌న్నా రేట్లు మాత్రం చుక్క‌ల్లోనే ఉంటాయి.
Tags:    

Similar News