మాజీ మంత్రి, వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.. ఫైర్ బ్రాండ్.. వెల్లంపల్లి శ్రీనివాస్‌కు మళ్లీ పదవి ఇస్తారా? ఆయనను మళ్లీ మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నారా? అంటే.. ఔననే చర్చ విజయవాడ పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా సాగుతోంది. గత జగన్ మంత్రివర్గంలో అనూహ్యంగా చోటు దక్కించుకున్న వెల్లంపల్లి.. దేవదాయ శాఖ మంత్రిగా చక్రం తిప్పారు. అయితే.. ఆయన నిత్యం వివాదాల్లోనే ఉన్నారు. ఆయన శాఖపై అనేక ఘర్షణలు తెరమీదికివచ్చాయి.
అయితే.. వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టారనే పేరు సంపాదించుకున్నారు. పార్టీ అధిష్టానం దృష్టిలో ఇప్పటికీ మంచి పేరుంది. తాడేపల్లి కార్యాలయంలో ఏ కార్యక్రమం జరిగినా.. వెల్లంపల్లికి ఆహ్వానం అం దుతోంది.
పార్టీ సీనియర్ల మధ్య కూడా ఆయనకు మంచి పేరుంది. ప్రతిపక్షాలపై విరుచుకుపడడంంలో నూ.. వారి వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వడంలోనూ.. శ్రీనివాస్ ముందున్నారనే పేరు సంపాయించుకున్నా రు. అయితే.. అనూహ్యంగా ఆయనను రెండోసారి మంత్రి వర్గం నుంచి తప్పించారు.
అయినప్పటికీ.. ఆయన నియోజకవర్గంలో జోరుగా తిరుగుతున్నారు. ప్రతి పనినీ ఆయనే ప్రారంభిస్తున్నా రు. ప్రస్తుతం విజయవాడలో ఆయన వైసీపీకి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ.. ఆయన ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కౌంటర్లు ఇస్తున్నారు. పైగా.. వైశ్య సామాజిక వర్గాన్ని ఏకం చేసేందుకు ఇటీవలకాలంలో ఒక ప్రాజెక్టును కూడా చేపట్టారు. త్వరలోనే ఆయన జిల్లాల్లో పర్యటించి.. వైశ్య వర్గాన్ని పార్టికి అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వెల్లంపల్లికి.. మరోసారి పదవి దక్కడం ఖాయమని.. ఆయనను జగన్ మరోసారి తన మం త్రి వర్గంలోకి తీసుకుంటారని.. వెల్లంపల్లి అనుచరులు.. ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇది నిజమో కాదో తెలియదు కానీ.. స్థానికంగా.. అంటే.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాలకు చెక్ పెట్టేందుకు.. వెల్లంపల్లి ఇలా చేస్తున్నారనే ప్రచారం కూడా ఉండడం గమనార్హం.
ఇప్పటికే ఆయనకు నియోజకవర్గంలో వ్యతిరేకత ఎక్కువుగా ఉందని... వచ్చే ఎన్నికల్లో తన టిక్కెట్‌కు ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఆయన ఈ కొత్త గేమ్ ఆడుతున్నారని కొందరు అంటున్నారు. మరి ఆయనకు నిజంగానే మళ్లీ పదవి వస్తుందా ? టిక్కెట్‌పై డౌట్‌తోనే ఆయన ఈ ఎత్తుగడలు వేస్తున్నారా ? అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.