ఇద్దరు తెలుగు ప్రముఖులు ఒకరిపై ఒకరు విపరీతంగా పొగిడేసుకోవటాలు గమనించారా? ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా ఒకరిపై ఒకరు తమకున్న అభిమానాన్ని చాటి చెప్పుకోవటం.. ఒకరి గొప్పను మరొకరు ప్రస్తావించటం.. ఇదంతా మీడియాలో ప్రముఖంగా రావటం కాస్తంత ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే.. ఈ ఇద్దరు ప్రముఖులు తెలుగు రాష్ట్రాల్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండటమే కారణం.
ఇంతకీ ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరంటారా? ఇంకెవరు.. ఒకరేమో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అయితే.. మరొకరు మీడియా మొఘల్ రామోజీరావు. ఒకేరోజున వీరిద్దరూ ఒకరినిఒకరు పొగుడుకోవటం ఈనాడు పేపర్లో వచ్చేసింది. సాధారణంగా రామోజీ రావును విపరీతంగా పొగిడేయటం కాస్తంత తక్కువే. ఒకవేళ పొగిడినా అలాంటి విషయాలు పెద్దగా రాకుండా ఈనాడులో జాగ్రత్తపడతారు. అదేమంటే.. ‘‘మనల్ని ఎవరో పొగిడితే.. ఆ పొగడ్తను మన పేపర్లోనే ప్రముఖంగా వేసుకుంటే ఏ బాగుంటుంది’’ అనే వ్యాఖ్యను ఈనాడులోని ముఖ్యులు వ్యాఖ్యానిస్తుంటారు.
మరి.. అలాంటి రేఖల్ని కూడా చెరిపేస్తూ.. తాజాగా రామోజీరావును కేంద్రమంత్రి పొగిడిన ఒక వ్యాఖ్యను ఈనాడులో ప్రముఖంగా ప్రచురించారు. రామోజీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఓంసిటీ గురించి మాట్లాడిన వెంకయ్య.. ‘‘ఈ శతాబ్దపు అద్భుతం.. ఓం సిటీ’’ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి గొప్ప కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. దీనికి ఏ మాత్రం తగ్గని రీతిలో ఈనాడు ఆదివారం అనుబంధంలో వెంకయ్యనాయుడి ట్రస్ట్ అయిన ‘‘స్వర్ణ భారతి’’ గురించి.. ‘‘అదిగదిగో స్వర్ణభారతం’’ అంటూ పెద్ద కథనమే అచ్చేశారు. అంత పెద్ద ట్రస్ట్ గురించి ఆ మాత్రం రాయటం కూడా తప్పేనా? అని ఎవరైనా ప్రశ్నించొచ్చు. కానీ.. ఇప్పటికే సదరు ట్రస్ట్ గురించి.. దాని గొప్పతనం గురించి గతంలోనూ ఇదే తరహా కథనాలు ఈనాడు ఆదివారం అనుబంధంలో అచ్చేయటం కాస్తంత విశేషమే. ఈ పరస్పర పొగుడుకోవటాలు ఏమిటో..?