చెప్పేందుకు కాస్త ముతగ్గా అనిపించినా గుజరాతీవోడి తెలివే తెలివి. ఇటలీ నుంచి వచ్చిన ఆమ్మ ఏపీని రెండు ముక్కలు చేసేందుకు కిందామీదా పడింది. అలా ముక్కలు చేసిన కారణంగా తీవ్రంగా నష్టపోయే ఏపీకి ఎంతోకొంత సాయం చేయాలన్న ఆలోచన చేసింది. ఇందుకోసంకొంత ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తమిళ తంబీలను.. బెంగాలీ బాబును.. మధ్యప్రదేశ్ మధ్యవర్తిని.. కశ్మీర్ చిన్నోడ్ని ఆయుధంగా వాడింది.
కానీ.. గుజరాత్ కు చెందిన మోడీ మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేదేంది అని ఫీలైన ఆయన.. దేశ ప్రధాని స్థానంలో ఉండి పార్లమెంటులో స్వయంగా ఇచ్చిన హామీని తూచ్ అనేందుకు సైతం తెగించారు. తానెంతగా తెగించారన్న విషయాన్ని లోకానికి అర్థమయ్యేలా చెప్పేందుకు వీలుగా ఒక ఆంధ్రోడ్ని ఆయుధంగా చేసుకొని ఆంధ్రోళ్ల మీద సంధించటం మోడీకి మాత్రమే చెల్లుతుంది. తానే మాత్రం సీన్లోకి రాకుండా.. ఆంధ్రోళ్ల యవ్వారాన్ని మరో ఆంధ్రోడి చేత సెట్ చేసే ప్రయత్నం చేశారు.
తాజాగా రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరిగిన సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన వారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. అలా చెప్పేసినోళ్లలో బీహార్.. బెంగాల్ కు చెందిన నేతలూ ఉన్నారు. ఈ సందర్భంగా వారు ఏపీకి ఎందుకు మోసగించకూడదన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పినా.. వారు చెప్పిన మాటల్ని పూర్తిగా కొట్టిపారేస్తూ.. సీమాంధ్రుడైన వెంకయ్యనాయుడు ప్రభుత్వ విధానాన్ని చెప్పే బాధ్యతను స్వీకరించారు. పాడిందే పాడరా.. అన్నట్లుగా ఏపీ ప్రత్యేక హోదా ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిన తర్వాత కూడా వెంకయ్య మాత్రం అందుకు భిన్నంగా.. తాము ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న విషయాన్ని విస్పష్టంగా చెప్పేశారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై మీ వాదనల్ని సమర్థిస్తున్నాను కానీ.. ఇప్పుడు హోదాపై బిల్లు పెట్టలేమని వెంకయ్య తేల్చేశారు. ఏపీ ప్రయోజనాల్ని కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పిన ఆయన.. ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో డిమాండ్లు వస్తున్నాయన్నారు. ఏపీ నుంచి తాను ఎన్నిక కాకున్నా ఆ రాష్ట్రంలోని సమస్యల పరిష్కారం కోసం తాను ప్రయత్నిస్తున్నట్లగా వెంకయ్య గొప్పలు చెప్పుకున్నారు. ప్రత్యేక హోదాతో కొంత సాయమవుతుందే తప్పించి.. మొత్తంగా అన్ని సమస్యలకు ప్రత్యేక హోదా ఏ మాత్రం పరిష్కారం కాదన్న ఆయన.. విభజన చట్టంలో ఇచ్చిన హామీల్ని తాము నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు. ఏపీకి పైసా ప్రయోజనం కలిగేలా మాట్లాడని వెంకయ్య.. మోడీ తనపై పెట్టిన బాధ్యతను దిగ్విజయంగా పూర్తి చేశారని చెప్పాలి.