మాటల మాంత్రికుడిగా పేరొందిన కేంద్ర పట్టణాబివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మరోమారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి- రాష్ట్రంలోని రాజకీయాల గురించి తనదైన శైలిలో విశ్లేషించారు. రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గ ఆమోదం లభించిన సందర్భంగా ఆయన ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడారు. ప్యాకేజీకి చట్టబద్ధత లభించడంతో విభజన సమయంలో హామీ ఇచ్చిన ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదా ఇక ముగిసిన అధ్యాయమేనని వెంకయ్యనాయుడు తేల్చిచెప్పారు. యూపీఏ ప్రభుత్వం అవశేష ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన హక్కులు - ప్రయోజనాలను పరిగణనలోకి తీసు కోకుండా రాష్ట్రాన్ని అనాలోచితంగా, అశాస్త్రీయం గా విభజించిందని ఆరోపించారు. విభజనతో తెలంగాణకు వెళ్లిన హైద్రాబాద్ మహా నగరం లేకపోవడంతో ఏర్పడిన లోటును వెంటనే తీర్చడం కష్టమే అయినా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయాలన్న అభిప్రాయంతో ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా చూస్తోందని ఆయన వివరించారు.
రాజకీయంగా వివాదాలను సృష్టించి కేంద్రం- రాష్ట్రం మధ్య ఉన్న సత్సంబంధాలను చెడగొట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ వెంకయ్య నాయుడు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీ అభివృద్ధిని అడుకోవడానికి బదులు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని హితవు పలికారు. విభజన చట్టంలో పేర్కొన్న, పేర్కొనని పలు సంస్థలను - విద్యా సంస్థలను నెలకొల్పుతున్నామని, రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏయే పరిశ్రమలు నెలకొల్పాలో ఆలోచించి చేస్తున్నామని వెంకయ్య నాయుడు తెలిపారు. పోర్టుల విస్తరణ - అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఆయా మంత్రిత్వశాఖలు చురుగ్గా పనిచేస్తున్నాయని, విభజన హామీల అమలుపై తాను కేంద్ర మంత్రులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని తెలియజేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల కలిగే నష్టాన్ని ప్యాకేజీ రూపంలో విదేశీ ఆర్థిక సహాయ ప్రాజెక్టుల రుణాలను తిరిగి చెల్లించడంలో ఎక్కువ బాధ్యతను తీసుకోవడం ద్వారా కేంద్రం పూడుస్తుందని వెంకయ్యనాయుడు తెలిపారు. అయితే, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినంత మాత్రాన రాష్ట్రానికి అన్నీ వచ్చేస్తాయని అనుకోవడం కూడా తప్పేనని కేంద్ర మంత్రి చెప్పారు. రాష్ట్రానికి అండగా నిలవడంలో కేంద్రానికి కొన్ని పరిమితులున్నాయని, అయినప్పటికీ, ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామన్న ఆయన విభజన తర్వాత రాష్ట్రానికి ఇప్పటివరకూ వివిధ పద్దుల క్రింద కేంద్ర ప్రబుత్వం రు.10,461 కోట్ల నిధులు అందించిందని వెల్లడించారు.
విభజన చట్టం ప్రకారం ఏపీలో నెలకొల్పాల్సిన కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం ఇంకా పెండింగ్ లోనే ఉన్నప్పటికీ త్వరలోనే ఒక కొలిక్కి వస్తాయని వెంకయ్య నాయుడు తెలిపారు. విభజన పర్యవసానంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన, అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను విలేఖరులు ప్రస్తావించిప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించినా కొత్త రాష్ట్రాలు రెండూ కలిసి నడవాలని, అన్ని విషయాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని వెంకయ్యనాయుడు సలహా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో పూర్వపు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే నిర్మాణం వేగవంతమైందని చెప్పారు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టులో భాగంగా నెలకొల్పే విద్యుత్ కేంద్రం నిర్మాణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సీ ఉంటుందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అప్పటి ప్రధాని పార్లమెంట్‌లో ప్రకటించిన ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఏపీకి ఎంతమేరకు నిధులు లభించి ఉండేవో అంచనా వేయడం కొంచెం కష్టమేనని విలేఖరుల ప్రశ్నలకు సమాధానంగా పేర్కొన్న ఆయన ఇతర రాష్ట్రాలకు అందుతున్న నిధుల ఆధారంగా ఒక అంచనాకు వచ్చి ఆ మేరకు నిధులను ఆంధ్రప్రదేశ్ కు సమకూర్చడానికి కేంద్ర ప్రబుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసి ప్యాకేజీని ప్రకటించిందని వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/