తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందో తెలియంది కాదు. తానెంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని చేపడుతున్న పథకాలకు సంబంధించిన పేరుప్రఖ్యాతుల్లో వాటా కోరుకోవటానికి కేసీఆర్ అస్సలు ఇష్టపడరు. ఎవరైనా సరే తనకు ఉపయోగపడాలే తప్పించి.. తాను ఉపయోగపడటానికి అస్సలు ఇష్టపడరు. రాష్ట్ర సర్కారు చేపట్టే పథకాలకు కేంద్రం సాయం చేయటం అన్నది సమాఖ్య వ్యవస్థలో భాగమని చెప్పే కేసీఆర్.. మరి అంత సాయం చేసే కేంద్రానికి..ఆ పథకం ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతుల్లో వాటా ఇవ్వటానికి ఏ మాత్రం ఇష్టపడరు.
తాజాగా ఆయన పదే పదే ప్రస్తావిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం కానీ.. తెలంగాణలో కోతల్లేకుండా కరెంటు సరఫరా చేయటం లాంటివి తన ఘనతలుగా తెలంగాణ ముఖ్యమంత్రి పదే పదే చెప్పుకోవటం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఇవే అంశాల మీద కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి. తెలంగాణలో కడుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం కేంద్రానిదని.. తెలంగాణతో సహా ఏపీలోనూ కోతల్లేని కరెంటు సరఫరా కేంద్రం పుణ్యంగా ఆయన చెప్పుకొచ్చారు.
తన పాలనా దక్షతకు నిలువెత్తు రూపాలుగా ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ కు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసే వారు ఎవరైనా సరే.. వెనుకా ముందు చూసుకోకుండా ఏసుకునే అలవాటున్న కేసీఆర్.. వెంకయ్య మీద రాజకీయ పంచ్ లు వేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.