కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విభజన సమయంలో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని నాటి ప్రధాని మన్మోహన్ హామీ ఇవ్వటం.. అప్పుడు విపక్షంలో ఉన్న వెంకయ్య.. ఐదేళ్లు మీరు ఇచ్చేదేమిటి? మీ తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే.. మీరు ఐదేళ్లు ఇస్తే.. మేం పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటూ బీరాలు పలికిన వ్యక్తి.. అధికారంలోకి వచ్చాక మాత్రం మొత్తంగా ప్లేట్ మార్చేయటం తెలిసిందే.
తాజాగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న ఆయన.. ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న వామపక్షాలపై ఆయన చిత్రమైన వాదనలు చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో ఏ హోదా లేని వామపక్షాలు ఏ హోదాలో ప్రత్యేక హోదాతో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడుగుతున్నాయో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
దేశంలో కమ్యూనిస్టులకు కాలం చెల్లిందన్న వ్యాఖ్య చేసిన వెంకయ్య.. ఏపీ ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేయాలంటూ ఏదో ఒక హోదా అసెంబ్లీలో ఉండాలంటూ చేస్తున్న వాదనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండే వారే పోరాటాలు చేయాలన్నట్లుగా వెంకయ్య మాటలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి. కానీ.. ఇలాంటి తొందరపాటు వ్యాఖ్యల కారణంగా లాభం కంటే కూడా నష్టమే ఎక్కువన్న విషయం వెంకయ్య మర్చిపోకూడదు. పవర్ చేతిలో ఉంటే.. నోటి నుంచి మాటలు ఇలానే వస్తాయేమో.