గ్రామస్థాయి నుంచి ఢిల్లీ స్తాయి వరకు ప్రతి రాజకీయ నాయకుడూ తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొస్తుంటారు. వారిని రాజకీయంగా స్థిరపడేలా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొన్నికొన్ని సందర్భాల్లో నేతలు ఆ దిశగా ప్రయత్నాలు చేయకముందే వారి వారసులు తామే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నిలదొక్కుకుంటారు. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో వారసులు ఎన్ని వేల మంది ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే... కొందరు నేతలు మాత్రం ఎందుకో తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకురావడం లేదు... వారి వారసులూ అందుకు ఆసక్తి చూపకుండా ఇతర రంగాలను ఎంచుకుంటున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడూ ఇదే కోవకు చెందిన నేత అని.. ఆయన తన వారసులను రాజకీయాల దిశగా తేలేదని అంతా భావించారు. కానీ, తాజా పరిస్థితులు మాత్రం వెంకయ్య వారసులు కూడా పొలిటికల్ అరంగేట్రానికి రెడీ అవుతున్నారని చెబుతున్నాయి.
రాజకీయ వారసత్వంపై వెంకయ్య మనసు మార్చుకున్నారని ....తన కుమర్తె దీపా వెంకట్ ను రాజీకీయల్లోకి తీసుకురావాలని వెంకయ్యనాయుడు బావిస్తున్నారని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో జరిగిన వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలకు సంబంధించిన ఏర్పట్లను దీపా వెంకట్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే స్వర్ణభారతి ట్రస్టు ద్వారా సేవా కార్యాక్రమాలను నిర్వహిస్తున్న ఆమె ఇంతవరకు నెల్లూరు కు మాత్రమే పరిమితమయ్యారు. తన ట్రస్టు కార్యకలాపాలను ఆమె హైదరాబాద్ లోనూ ప్రారంభించాలని భావిస్తూ శంషాబాద్ సమీపంలో అందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు . ఇవన్నీ గమనిస్తున్న కొందరు బీజేపీ నేతలు 2019 ఎన్నికల నాటికి ఏదో ఒక నియోజక వర్గం నుంచి లోక్ సభ బరిలో దిగుతారని అంచనా వేస్తున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుతురు కావడం తో ఆమె విజయానికి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సహకరిస్తారని అనుకుంటున్నారు. మొత్తానికి ఆమె వచ్చే ఎన్నికల తరువాత పార్లమెంటులో అడుగుపెట్టడం ఖాయమని తెలుస్తోంది.
అయితే.. తరచూ నెహ్రూ-గాంధీ కుటుంబాల రాజకీయ వారసత్వంపై తీవ్ర విమర్శలు చేసే వెంకయ్య ఇప్పుడు కుమార్తెను రాజకీయాల్లోకి తెచ్చి లోక్ సభకు పంపితే ఆయన పిలక కాంగ్రెస్ చేతికి చిక్కినట్లే.